గదిలో పుట్టగొడుగులు పెంచి.. లక్షాధికారులయ్యారు

మైసూర్ : ఉన్నత విద్య చదివాం.. కొద్దొగొప్పో అనుభవం సాధించాం.. అయితే ప్రభుత్వం ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఏం చేయడం? ఈ ప్రభుత్వం నిరుద్యోగులను తయారు చేస్తుంది అంటూ తిడుతూ కూర్చోవడం కన్నా.. ఒక కొవ్వొత్తి వెలిగించి చీకటిని పారద్రోలవచ్చు. ఉద్యోగాలంటూ ప్రభుత్వాలను తూర్పారబట్టే బదులుగా ఉన్న వనరులను ఉపయోగించుకొని ముందుకెళ్లడంపై కూడా ఆలోచిస్తే ఇదిగో ఇలా మైసూరు కుర్రాళ్ల మాదిరిగా లక్షాధికారులు కావచ్చు.
ఈజీగా వచ్చే వాటిని ఎంజాయ్ చేయడమే కాదు.. కష్టించి పనిచేసి ఫలితాలు రాబట్టే శక్తి కూడా ఉన్నదని నిరూపిస్తున్నారు మైసూర్ కు చెందిన యువకులు. స్థానికంగా బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్న క్లింట్ డెవిస్ .. ఫైనల్ ఇయర్ లో పుట్టగొడుగులతో మద్యం తయారీ ప్రాజెక్టును ఎంచుకొన్నాడు. ఇదే ఆయనతోపాటు మరో ఇద్దరు విద్యార్థుల దశ తిప్పేసింది. తొలుత క్లింట్.. తాను ఉంటున్న గదిలో ప్రయోగాత్మకంగా పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి మద్యం తయారీ చేయడం ఎలా? అనే దానిపై చాలా రోజులు ఆలోచించాడు. ఇదే సమయంలో తాను పెంచిన పుట్టగొడుగులను మార్కెట్లో అమ్మకానికి పెట్టగా మంచి సంపాదనే వచ్చింది. డిగ్రీ పూర్తవగానే పుట్టగొడుగుల ఉత్పత్తిరంగాన్నే ఎంచుకొన్న క్లింట్.. ఎమర్జెన్సీ మెడిసిన్ చదువుతున్న మరో మిత్రుడు అజయ్ జోస్ తో కలిసి పరిశోధన చేశాడు. తుదకు ఆర్గానిక్ మష్రూమ్స్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకొని షుగర్ కేన్ క్రేట్లను కూడా సిద్ధం చేసుకొన్నారు. ఇంకో మిత్రుడు రాజ్ కుమార్ కూడా వీరితో కలిసి పుట్టగొడుగులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పెట్టుబడి పెట్టేందుకు స్నేహితుడు తన బంగారం కుదువపెట్టి డబ్బు ఇవ్వగా.. కొన్నాళ్లు వీరు డెలివరీ బాయ్స్ గా కూడా పనిచేశారు.
౩ నెలల్లో మూడున్నర లక్షల ఆదాయం
చివరకు, 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్ వేసి అందులో మిల్కీ, ఓలిస్టర్, ఫంగో రకాలను పండించారు. గది ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని అవసరమైన మేర ఉండేలా చిననపాటి టెక్నాలజీని కూడా సొంతంగా తయారుచేసుకొన్నారు. దాంతో మంచి దిగుబడితో మార్కెట్ ను ముంచెత్తారు. దాతో మూడు నెలల్లోనే రూ.3,50,000 సంపాదించారు. ప్రస్తుతం ప్రతీ మూడు నెలలకోసారి వేయి కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ట్రిపుల్ ఈ అవార్డుల కో సం 350 విశ్వవిద్యాలయాలతో పోటీ పడిన ఈ ముగ్గురు విద్యార్థులు.. స్టూడెంట్ డ్రైవ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.
"సాధారణ ప్రయోగంతో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభమైనది. తర్వాత వ్యాపార వ్యాపారంగా మారింది. ఎంతో శోధించి ఆర్గానిక్ మష్రూమ్స్ అందించే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉన్నది. ఈ-కామర్స్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నా. అలాగే పుట్టగొడుగులతో ఊరగాయలు, పొడులు మరియు వైన్ వంటి ఉత్పత్తులను రూపొందించడానికి కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం” అని క్లింట్ ముగించారు. సాధించాలనే తపన, కష్టపడే తత్వం ఉంటే.. మనం కూడా గొప్ప ఎంట్రప్రెన్యూర్ గా తయారుకావచ్చని ఈ ముగ్గురు విద్యార్థులు నిరూపించారు.
తాజావార్తలు
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ