e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home వ్యవసాయం మల్చింగ్‌ మంచిదే!

మల్చింగ్‌ మంచిదే!

ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్‌’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్‌ షీట్‌’తో ‘మల్చింగ్‌’ చేస్తున్నారు. దీనివల్ల అనేక లాభాలు..

 • మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమ ఆవిరి కాకుండా ఈ ప్లాస్టిక్‌ షీట్‌ నివారిస్తుంది. ఫలితంగా 30-40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. బిందు సేద్య పద్ధతిలో అదనంగా మరో 20 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు.
 • కలుపు మొక్కలపై సూర్యరశ్మిని చేరనీయదు. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ నిలిచిపోయి, 85 శాతం వరకూ కలుపు నివారణ అవుతుంది.
 • వర్షపు నీటిని నేరుగా భూమిపై పడనీయదు. దీంతో మట్టి కోతకు గురికాకుండా ఉంటుంది. ఫలితంగా భూసారాన్నీ రక్షిస్తుంది.
 • మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమవుతుంది. దీంతో మొక్కలకు అన్ని పోషకాలూ అందే అవకాశం ఉంటుంది.
 • వేసవిలో పారదర్శక ఫిల్మును భూమిపై పరిచి, సూర్యరశ్మిని ప్రసరింపజేయడం వల్ల భూమిలోని క్రిమికీటకాదులు, తెగుళ్లను నివారించవచ్చు. ఈ ప్రక్రియను ‘నేల సోలరైజేషన్‌’ అంటారు.
 • మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కల్పిస్తుంది. దీనివల్ల పంట ఏపుగా పెరిగి, నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు (20-50 శాతం) పొందవచ్చు.
 • భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండేలా చూస్తుంది. దీంతో నేల గుల్లబారి వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది. నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. పంట కాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది.

మల్చింగ్‌ ఇలా..

విత్తనాలు వేయడానికి ముందు లేదా మొక్కలు మొలిచిన తర్వాతైనా మల్చింగ్‌ షీట్‌ వేసుకోవచ్చు. ఇందుకోసం మొదటగా, మొక్కల మధ్య, వరుసల మధ్య దూరాన్ని బట్టి షీటుపై రంధ్రాలు చేయాలి (ప్రస్తుతం రంధ్రాలున్న షీట్లు కూడా దొరుకుతున్నాయి). వీటిని నాగలి సాళ్ల మీద పరిచి, రెండువైపులా కొనలపైన మట్టిని ఎగదోయాలి. దీనివల్ల మల్చింగ్‌ కవర్‌ గాలికి కొట్టుకుపోకుండా ఉంటుంది. ఒక్కో రంధ్రంలో రెండు లేదా మూడు విత్తనాలు వేసి, మట్టిని కప్పాలి.

అనేక లాభాలు..

- Advertisement -

ఉద్యాన పంటల్లో మల్చింగ్‌ వల్ల అనేక లాభాలుంటాయి. నీటి ఆదాతోపాటు కలుపు నివారణ కూడా చాలా తేలిక. నేలలో తేమ శాతాన్నీ కాపాడుకోవచ్చు. ఎరువులకు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందడం వల్ల నాణ్యమైన దిగు
బడులు వస్తాయి.

సీహెచ్‌.నరేశ్‌, కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త, గడ్డిపల్లి

జాగ్రత్తలు

 • మల్చింగ్‌ షీట్‌ను సరిగ్గా వేయకుంటే.. కప్పలు, పాములు, ఇతర కీటకాలకు ఆశ్రయంగా మారుతుంది.
 • మల్చింగ్‌ షీటును బలంగా లాగకూడదు.
 • చల్లని వాతావరణంలో అంటే.. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ షీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. ఎండలో షీటు
 • వ్యాకోచిస్తుంది.
 • పంట సమయంలో ఈ షీట్‌ను పశువులు తొక్కకుండా చూసుకోవాలి.
 • పంటకాలం ముగిసిన తర్వాత మల్చింగ్‌ షీటును పొలం నుంచి తీసేయాలి.

ఎన్నెన్నో రకాలు..

 • మల్చింగ్‌ షీట్లు వివిధ రంగులు, వివిధ మందాలతో లభిస్తాయి. కాబట్టి సీజన్‌, పంటను బట్టి షీట్లను ఎంపిక
 • చేసుకోవాలి.
 • వర్షాకాలం పంటలకు రంధ్రాలుండే షీట్లు, వేసవి పంటలకు తెలుపు రంగు షీట్లు వాడుకోవాలి.
 • కూరగాయలు, పూల తోటల కోసం ఎక్కువ మందం ఉండే షీట్లు మంచివి.
 • వెండి రంగు షీట్లు పురుగులను, నలుపు రంగు షీట్లు కలుపునూ నివారిస్తాయి.
 • 7-25 మైక్రాన్ల మందం ఉండే షీట్లు మూడేండ్ల వరకూ వస్తాయి.

నట్టే కోటేశ్వర్‌ రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement