సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!

- ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న రైతు
- మొక్క పెరుగుతూనే కాత షురూ
- ఒక్కో చెట్టుకు 100 నుంచి 150 కాయలు
- తక్కువ వ్యవధిలో ఫలసాయం
- ఒక్కో కాయ బరువు అర కిలోపైనే..
- మూడెకరాల్లో 4500 మొక్కలు నాటిన గోవిందాపూర్ రైతు
- అంతర పంటలుగా టమాట, ముల్లంగి, బంతి
సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు ఇప్పుడు పండ్లు, కూరగాయలే గాక మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలు వేసేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బూర రవీందర్ కూడా ఇలాంటి ఆలోచనతోనే తైవాన్ రకం జామను ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం తన మూడెకరాల్లో 4500 మొక్కలు నాటగా, అప్పుడే కాత మొదలైంది. అరకిలో బరువుతో చెట్టుకు 150 కాయలు కాయగా, ఇప్పటికే ఒక పంట తీశానని మాములు జామకు మూడేళ్లు పడుతుందంటున్నాడీ రైతు. అంతేగాక వాటిలో అంతర పంటలుగా టమాట, ముల్లంగి వేసి అదనపు ఆదాయమూ పొందుతున్నాడు. - శాయంపేట
సంప్రదాయ పంటలను వదిలి తైవాన్ జామ వైపు మళ్లాడు శాయంపేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బూర రవీందర్. అధిక శ్రమతో పాటు దిగుబడి కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో ప్రయోగాత్మకంగా కొత్త రకం సాగు మొ దలుపెట్టాడు. స్థానిక జామ కాకుండా తక్కువ వ్యవధిలో ఎక్కువ ఫలసాయం ఇచ్చే ఈ మొక్కలను రా జమండ్రి సమీపంలోని కడియం నుంచి తీసుకొచ్చా డు. ఒక్కో మొక్కకు రూ.60 వెచ్చించి గత జూన్‌లో మూడెకరాల్లో 4500 మొక్కలు నాటాడు. ఇటీవల పంట చేతికి రావడంతో నాలుగు క్వింటాళ్లు విక్రయించాడు. మొదట కిలోకు రూ.40 చొప్పున క్విం టాల్ రూ.4వేలకు ప్రైవేటుకు అమ్మాడు. ప్రస్తుతం ఈ జామ పండ్ల ధర కిలో రూ.100 పలుకుతోందని చెబుతున్నాడు. ఇలా మంచి లాభాలుండడంతో మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు తైవాన్ జా మ వేస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభా లతో పదేండ్ల పాటు పంట వస్తున్నందున ఉత్సాహం చూపుతున్నారు. రెండేళ్ల పాటు ఆగితే మొక్క ఎదిగి మంచి కాత వస్తుందని చెబుతున్నారు.
అంతర పంటలతోనూ ఆదాయం
జామ తోటలో అంతర పంటలతో ఆదాయం పొందుతున్నారు రైతులు. మొక్క మొక్కకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో టమాట, ముల్లంగి సాగుచేస్తున్నాడు రవీందర్. ఇప్పటికే పెద్దమొత్తంలో పంట చేతికొచ్చింది. విత్తనం వేసిన రెండు నెలల్లోనే ముల్లంగి విరివిగా కాసింది. ఈ ప్రాంతంలో ముల్లంగి సాగు ఎక్కడా లేకపోవడం అతడికి కలిసివచ్చింది. డ్రిప్ పద్ధతిలో వీటిని పండిస్తున్నాడు. ఉపాధి హామీ ద్వారా పంటకు ఏడాదికి రూ.36వేల సాయం అందుతోంది. ఇలా ఒక తోటలో మూడు రకాల పంటలను వేసి లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
లాభాలు బాగున్నాయ్..
తైవాన్ రకం జామతో లాభాలు బాగున్నాయ్. మొక్క పెరుగుతూనే కాత మొదలవుతుంది. తోటపై రూ.4లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాను. ఆరు నెల్లకే నాలుగైదు ఫీట్లు పెరిగింది. ఇప్పటికే ఒక్కో చెట్టుకు వందకుపైగా కాయలు కాశాయి. కాయ అరకిలో పైనే ఉంది. పోషకాలు కూడా ఉంటాయ్. ఆపిల్ తిన్నట్టు ఉంటది. తోటలో అంతర పంటగా టమాట, ముల్లంగి, బంతి వేశాను. ఇదివరకు పత్తి, పసుపు, మక్కజొన్న పండించిన. వాటితో లాభం లేదనుకొని ఈసారి జామ వేశాను. అనుకున్నట్టుగానే దిగుబడి మంచిగుంది. మొక్క ఎదగాలంటే రెండేళ్ల వరకు క్రాప్ తీయవద్దు. అప్పుడే కాయ సైజు పెరుగుతుంది. ఈజీఎస్ కింద మూడేళ్ల పాటు నెలకు రూ.3వేలు ఇస్తామని అధికారులు చెప్పారు. మొక్కలు నాటినందుకు డబ్బులు ఇచ్చారు.
- బూర రవీందర్, రైతు, గోవిందాపూర్
తాజావార్తలు
- హిమాచల్‌లో మహమ్మారి కలకలం : మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్!
- జాన్వీకపూర్ కొత్త ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
- రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి కొప్పుల
- టీకా వేసుకున్న రక్షణమంత్రి.. కోవిన్‌లో 50 లక్షల రిజిస్ట్రేషన్లు
- బకాయిలు చెల్లించకున్నా కరెంటు కట్ చేయం : అజిత్ పవార్
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!