మంగళవారం 26 మే 2020
Agriculture - May 17, 2020 , 18:51:34

పత్తి విత్తనాలపై బార్‌, క్యూఆర్‌ కోడ్‌

పత్తి విత్తనాలపై బార్‌, క్యూఆర్‌ కోడ్‌

హైదరాబాద్‌: నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్‌పై బార్‌ / క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరిగా ముద్రించాలని కంపెనీలకు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖకు సూచించింది. బార్ ‌/ క్యూఆర్‌ కోడ్‌  విధానం ద్వారా విత్తనాన్ని ఉత్పత్తి చేసిన కంపెనీ, ప్రాంతం, మార్కెటింగ్‌ చేసిన సంస్థ, రిటైలర్‌ డీలర్‌, సాగు చేసిన రైతు.. ఇలా అన్ని వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. 

బార్ ‌/ క్యూఆర్‌ కోడ్‌ ఉన్న విత్తన బ్యాగులు, ప్యాకెట్లు మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. నకిలీ విత్తనాలను నిరోధించాలని, అనుమతిలేని విత్తన సరఫరాను అడ్డుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. నిబంధనలకు అనుగుణంగా లేబులింగ్‌, లాట్‌నంబర్‌ ఉండాలని, ఈ మేరకు విత్తన చట్టం 1966, 1986 విత్తన రూల్స్‌, విత్తన కంట్రోల్‌ ఆర్డర్‌ 1983 ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. 


logo