Agriculture
- Jul 01, 2020 , 23:57:56
VIDEOS
నారుమళ్లకు అనుకూలం

రాష్ట్రంలో మూడు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల కోసం పలు సూచనలు చేస్తున్నారు.
- రాబోయే వారంరోజుల్లో వర్షాలు పడే సూచనలున్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే సోయా, జొన్న, కంది, పెసర, పత్తిలాంటివి విత్తుకోవాలి.
- నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇదే అనువైన సమయం.
- రైతులు తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) విత్తనాలతో జూలై 10 నుంచి 25వ తేదీ వరకు నారు పోసుకోవాలి.
- పెసర, సోయాచిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రా. కార్బండజిమ్, 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.
- కంది, పత్తి (1:4 లేదా 1:6), కంది, జొన్న (1:4), కంది, సోయా (1:7) పంటల్ని అంతరపంటలుగా వేసుకోవాలి.
కూరగాయలు..
- కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు కనిపిస్తే, నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా.ఎసిఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.టమాట, వంగ, మిరప నారుమళ్లు పోసుకోవాలి.
- నీటి వసతి గల ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
- అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల కూరగాయ పంటల నారుమళ్లలో నారుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉన్నది. దీని నివారణకు కింది యాజమాన్య పద్ధతులు పాటించాలి...
- 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి.
- నారుమళ్లలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి.
- విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల కాప్టాన్ చొప్పున విత్తనశుద్ధి చేస్తే, నారుమడిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చును.
- విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెం. మీ. ఎడంతో వరుసలలో విత్తుకోవాలి.
తాజావార్తలు
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
MOST READ
TRENDING