మంగళవారం 14 జూలై 2020
Agriculture - Jun 17, 2020 , 23:46:21

కలుపు కష్టాలకు చెక్‌

కలుపు కష్టాలకు చెక్‌

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం

ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి, కందితోపాటు ఏ ఇతర ఆరుతడి పంటల్లోనైనా కలుపు తీయడం రైతుకు సవాలుగా మారింది. ఓ వైపు కూలీల కొరత వేధిస్తుంటే మరోవైపు పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. ఈ నేపథ్యంలో రైతుల కలుపు కష్టాలకు చెక్‌ పెట్టేందుకు సిరిసిల్లకు చెందిన ప్రవీణ్‌, సొంతంగా కలుపు మెషిన్‌ తయారు చేశాడు. చదివింది ఏడో తరగతే అయినా సాంకేతికతను ఒంట పట్టించుకుని ఆటోమొబైల్‌ ఇంజినీర్‌ మాదిరిగా కలుపు యంత్రాన్ని రూపొందించి, ఔరా అనిపించాడు. తొలుత ఆటో ఇంజిన్‌, స్కూటర్‌ ఇంజిన్‌తో ప్రయోగం చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత నెమ్మదిగా మరింత మెరుగైన యంత్రాలను తయారు చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఇతను రూపొందించిన కలుపు యంత్రంతో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పని చేయించుకోవచ్చు. ఒక లీటర్‌ పెట్రోల్‌తో ఒక గంటలో ఒక ఎకరంలో కలుపు తీయొచ్చని ప్రవీణ్‌ చెబుతున్నాడు. ఈ యంత్రంతో ఇతరుల సాయం లేకుండానే రైతు ఒక్కడే సొంతంగా కలుపు తీసుకునే వీలుంది. ఈ యంత్రం ధర రూ. 36వేలుగా నిర్ణయించినట్లు ప్రవీణ్‌ తెలిపారు. logo