శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Agriculture - Jun 10, 2020 , 22:23:07

ఇక స్మార్ట్‌ ‘ఎవుసం’..

ఇక స్మార్ట్‌ ‘ఎవుసం’..

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. సాగు విధానం, మార్కెటింగ్‌ పద్ధతులపై  రైతులకు సరైన సమాచారం అందడం లేదు. దీంతో దళారులను ఆశ్రయించి, మోసాలకు బలికావాల్సి వస్తున్నది. సాగు ఇబ్బందులను సాంకేతికత ఆధారంగా పరిష్కరించాలని.. వరంగల్‌ యువకుడు నవీన్‌ కుమార్‌ భావించాడు. విత్తనాల కొనుగోలు మొదలుకొని మార్కెటింగ్‌ వరకూ రైతుకు కావాల్సిన అన్ని సేవల్ని అందించాలనుకున్నాడు. ఇందుకోసం ‘నా పంట’ పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించాడు. 120కిపైగా పంటల గురించిన పూర్తి వివరాలను పొందుపరిచాడు. ఏ పంటను ఏ విధంగా సాగు చేయాలి.. ఏ తెగులుకు ఏ క్రిమిసంహారకాలు ఉపయోగించాలి.. సాంకేతిక పరికరాల వినియోగం లాంటి వివరాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్లలో రోజు వారీగా ఉండే ధర లను తెలిపే ఏర్పాటు చేశాడు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘నా పంట’ అని టైప్‌ చేసి, ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెజార్టీ రైతులకు అందుబాటులో ఉండేలా ఈ మొబైల్‌ యాప్‌ను ఇంగ్లిషుతోపాటు తెలుగు భాషలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.  

యాప్‌ ద్వారా అందించే సేవలు..

  • రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్కెట్లలోని పంటల ధరలు రోజూ తెలియజేస్తారు. 
  • రాష్ట్రంలోని 3వేలకు పైగా ఎరువుల దుకాణాలు, విత్తనాల డీలర్‌ షాపుల వివరాలు, ధరల మధ్య వ్యత్యాసం వెల్లడిస్తారు.
  • వరికోత మిషన్‌తోపాటు ఇతర వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు విక్రయించే వారి వివరాలు. అద్దెకు సంప్రదించాల్సిన చిరునామా ఇస్తారు.

పంట పెట్టుబడి అంచనాలతోపాటు జియో ట్యాగింగ్‌ 

  • ప్రభుత్వ సబ్సిడీ రుణాల వివరాలు. 
  • ఉత్పత్తులను నిల్వ చేసే కోల్డ్‌ స్టోరేజీల వివరాలు. 
  • నేల పరీక్షలు. 

పంటకు వాడాల్సిన మందుల వివరాలు 

  • పంటకు తెగులు సోకితే, ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దానికి అనుగుణంగా పరిష్కారం చెబుతారు. 
  • పంటల ఇన్సురెన్స్‌ వివరాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మిషన్ల వివరాలు.

VIDEOS

logo