సోమవారం 01 మార్చి 2021
Agriculture - Jun 10, 2020 , 22:23:06

కొత్తరకం.. నూనె అధికం..

కొత్తరకం..  నూనె అధికం..

రైతులతో పాటు పరిశ్రమలకూ లాభాలు అందించేలా రెండు నూతన రకం వేరుశనగ వంగడాలు ‘జీజేజీ-32(ఐసీజీవీ03043), కదిరి-6’ను ఇక్రిశాట్‌, గుజరాత్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేశాయి. ఇతర రకాలతో పోలిస్తే కొత్త రకం విత్తనాలు అత్యధిక నూనెను ఉత్పత్తి చేయనున్నాయి. వీటి గింజలు పెద్దగా ఉండటంతోపాటు అధిక నూనె, ప్రొటీన్లు కలిగి ఉన్నాయి. వీటిని వనపర్తిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. తద్వారా ఈ పంట తెలంగాణలోని నేలలకు అనువుగా ఉంటుందా..? లేదా..? ఏ మేరకు దిగుబడి వస్తుంది.. వంటి అంశాలను తెలుసుకోనున్నారు. ఆశించిన దిగుబడి వస్తే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇక్రిశాట్‌ కృషి చేస్తోందని సంస్థ ప్రధాన శాస్త్రవేత్త హరికిషన్‌ సూదిని తెలిపారు.

నూతన వేరుశనగ రకాల ప్రత్యేకతలు..

జీజేజీ-32 (ఐసీజీవీ 03043) రకం

  • అధిక నూనె శాతం (53శాతం) దీని ప్రత్యేకత. g వానకాలం : 120-125 రోజులు, యాసంగి : 130-135 రోజుల్లోనే దిగుబడి. 
  • ఎకరానికి 12-15 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. g ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. g మిషన్‌ ద్వారా కోతకు అనువైన రకం.
  • వేరుశనగ కాయలను తెంపిన తర్వాత, పశువుల మేతగానూ ఉపయోగించుకోవచ్చు.

కదిరి-6 రకం..

  • 105-110 రోజుల పంట కాలం.
  • ఆకర్షణీయమైన వేరుశనగ కాయలు, గింజలను ఇస్తుంది. 
  • తెగుళ్ళను తట్టుకొనే శక్తి కొంచెం తక్కువ. కావున శిలీంధ్ర నాశకాల మీద ఆధారపడాల్సి రావచ్చు.
  • ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

VIDEOS

logo