శనివారం 28 మార్చి 2020
Agriculture - Mar 18, 2020 , 22:15:55

రాళ్లల్లో రతనాల పంట

రాళ్లల్లో రతనాల పంట

  • గుట్టలపై కళకళలాడుతున్న పంటలు
  • రాయితీ పరికరాలతో అద్భుతమైన దిగుబడి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి : ఎత్తయిన కొండలు. ఎటుచూసినా రాళ్లూ రప్ప లు. ఎగుడు దిగుడు భూములు. చుక్క నీరు కూడా నిలువని స్థలంలో వ్యవసాయం చేస్తున్నారు గిరిజన రైతులు. వివరాల్లోకి వెళ్తే... సిర్పూర్‌(యు), కెరమెరి, జైనూర్‌ మండలాల రైతులు రాళ్లూ రప్పలతో నిండిన గుట్టలపై తుంపర సేద్యం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా 75 శాతం రాయితీపై అందిస్తున్న స్ప్రింక్లర్ల సాయంతో గోధుమ, జొన్న, మక్క, పండ్లు, కూరగాయలు, పత్తి తదితర పంటలు పండిస్తున్నారు.


తెలంగాణ ప్రభుత్వం రాయితీలు కల్పిసూ ప్రోత్సహిస్తుండటంతో బిందు సేద్యం వైపు ఆదివాసులు ఆస క్తి చూపుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై 148 మంది రైతులకు 18 లక్షల 50 వేల ఆర్థికసాయం అందించింది. దీంతో జిల్లాలో 340 ఎకరాల్లో గిరిజన రైతులు తుంపర సేద్యం చేస్తున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న 24 గంటల నిరంతర విద్యుత్‌తో 75 శాతం రాయితీపై అందిస్తున్న స్ప్రింక్లర్లను పొందుతూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇంతకాలం వానలపై ఆధారపడిన ఏజెన్సీ రైతులు మెలమెల్లగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం వైపు మళ్లుతున్నారు.

- జాడి హన్మయ్య, 9182777512


logo