వరిలో జింకు లోపనివారణ

యాసంగి వరి సాగు రాష్ట్రవ్యాప్తంగా భారీగానే సాగుతున్నది. ఆయకట్టు ప్రాంతం నుంచి మొద లు కొని మైదాన ప్రాంతాల్లోనూ రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అయితే యాసాంగి వరి సాగుకు సంబంధించి ఏమాత్రం ఏమరపాటుగా ఉండవద్దు. నేల స్వభావం, సాగు నీటి వసతికి అనుగుణం గా సాగు చేపట్టాలని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్ రైతులకు సూచించారు. ముఖ్యంగా వరిలో జింక్ లోపం, యాసంగిలో వచ్చే అగ్గితెగులు గురించి రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అట్లనే వాటి నివారణ పద్ధతులపై గురించి వివరించారు. జింక్‌లోపం కలిగిన నేలలో తీసుకోవాల్సిన చర్యలు, అగ్గితెగులు నివారణకు చేపట్టాల్సిన పద్ధతుల గురించి వారు తెలిపిన వివరాలు.
జింక్‌లోపం లక్షణాలు ఈవిధంగా..
పొలంలో నాటిన వరిలో రెండు వారాలలో జింక్‌లోపం ఉన్నైట్లెతే పల్లపు ప్రాంతాలలో వరి పంట వలయాకారంగా కనిపించడం మొదలవుతుంది. ఆకు మొదటి భాగంలో మధ్య ఈనే హరితం కోల్పోయి పసుపు వర్ణం కనపడుతుంది. ఆకుపచ్చ రంగు పోయి మొదలు పసుపు రంగుగా మారి కొన భాగం మామూలు ఆకుపచ్చరంగులో వుంటుంది. ముదు రు ఆకులలో కూడా ఈ లక్షణం కనపడుతుంది. నల్లనేలల విషయానికి వస్తే ఆకులు పసుపు రంగులో కనిపిస్తాయి. అదే ఎర్రనేలలో అయితే ముదురు ఆకులు తుప్పుపట్టినట్లుగా కనిపిస్తాయి. ఆక్కడక్కడ ఆకులలో చిన్న, చిన్న మచ్చలు సైతం కనపడుతాయి. ఆకులు పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోవడం గమనించవచ్చు. చౌడుభూముల్లో కొత్తగా సాగులోకి తెచ్చిన భూముల్లో జింక్‌లోపం తీవ్రంగా ఉన్నైట్లెతే 25-40 రోజుల వ్యవధిలో చాలా మొక్కలు చనిపోతాయి.
జింక్ లోపానికి ప్రధాన కారణాలు
నత్రజని, భాస్వరం ఎక్కువగా వేసే నేలల్లో సున్నం ఎక్కువగా ఉండే నేలల్లో ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉండే నేలల్లో జింక్‌లోపం కనపడుతుంది. మాగాణి, సేంద్రియ ఎరువు వేసిన నేల ల్లో వరుసగా వరి పంట ముందస్తుగా వేసే నేలల్లో, నారుమడులలో నీరు తీసిన తరువాత నాట్లు వేసే సమయంలో కూడా జింక్‌లోపం కనపడుతుంది. చలి ఎక్కువగా ఉండే సమయంలో పంట ముందుగానే సాగు చేపట్టినైట్లెతే జింక్ లోపం స్పష్టంగా కనపడుతుం ది. నత్రజని, భాస్వరం ఎరువులను తగినంత వేసినప్పటికీ పంట ఆశించిన విధంగా పెరుగకపోవచ్చు. పిలకల ఉత్పత్తి కూడా సంతృప్తిగా ఉండదు. ఇందుకు ప్రధాన కార ణం జింక్ లోపమే .
యాజమాన్య పద్ధతులు
జింక్‌లోపం నివారణకు నాట్లు వేసిన రెండు నుంచి ఐదు వారాల మధ్య పంట మీద జింక్‌లోపం గుర్తించినైట్లెతే తక్షణం పొలం నుంచి పాత నీటిని తీసివేసి కొత్తనీటిని పొలానికి పెట్టాలి. ప్రతి మూడు పంటలకు ఎకరాకు 20కిలోల జింక్ సల్ఫేట్ నాటే ముందు వేసుకొని నివారించుకోవచ్చు. జింక్ సల్ఫేట్‌ను ఆఖరి దమ్ముకు ముందువేసి కలియదున్నాలి. చౌడు భూముల్లో ఎకరాకు 49కిలోల జింక్‌సల్ఫేట్‌ను వేసుకోవాలి. జింక్‌లోపం పంట మీద కనిపించిన వెంటనే జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 2గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేయాలి.
అగ్గితెగులు లక్షణాలు
ఈ తెగులు ఆశిస్తే నారుమడితో పాటు వరి పైరు తొలిదశలో ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణ పెద్దమచ్చలుగా తయారవుతాయి. ఈ మచ్చలు అంచుల ముదురు గోధుమరంగు లేదా నలుపురంగులో ఉండి మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. తద్వారా అగ్గితెగులుగా ప్రారంభం అవుతుంది. పిలక దశలో మచ్చలు రావడంతో మొక్క లు రంగులు మారుతుంటాయి. పోషకాలు అందకపోవడం వలన విరిగి వేళాడుతుంటాయి. తద్వారా గింజలు తాలుగా మారే అవకాశం ఉంటుంది. గింజలు బియ్యంగా తయారుచేసే క్రమంలో నూకలుగా మారుతుంటాయి.
ఆశించడానికి కారణాలు
నత్రజని అధిక మోతాదులో వాడటం, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గినప్పుడు, పగటి ఉష్ణోగ్రతలు 25-30 డిగ్రీలు ఉన్న సమయంలో గాలి లో తేమ 90 శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, మబ్బులు ఉన్న సమయంలో అగ్గితెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అదే విధంగా వారంరోజుల పాటు వరుసగా మంచు కురవడం, పొలంలో, పొలం గట్లపై గడ్డిజాతి కలుపు మొక్కలు ఉండటం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నది.
యాజమాన్య పద్ధతులు
ఈ తెగులు తరుచూ ఆశించే ప్రాంతాలలో తెగులు తట్టుకునే రకాలు సాగుచేయాలి. విత్తనశుద్ధి తప్పని సరిగా చేయాలి. పంటపై ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6గ్రా లేదా, ఐసోప్రోథయెలెన్ 1.5 మి.లీ. లేదా, కాసుగమైసిన్ 2.5 మిల్లీ లీటర్లకు గాను లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, ఉధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
మద్దెల లక్ష్మణ్, 9010723131
ఖమ్మం వ్యవసాయం
రైతుబడికి ఆహ్వానం
రైతు పంట పొలాలే జీవితంగా వ్యవసాయంలో రేయిం బవళ్లు పనిచేస్తాడు. తమవైన అనుభవాలు, గుణపాఠాలతో మెరుగైన, మేలైన పంట విధానాల కు జీవం పోస్తాడు. ఇలాంటి అనుభవాలు పదిమందితో పంచుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి రైతులు తమవైన అనుభవాలు, గుణపాఠాలతో పాటు, తమ సృజనాత్మక పనిలో భాగంగా కొత్తగా ఆవిష్కరించిన పనిముట్ల గురించి రైతుబడికి రాసి పంపించగలరు.
డాక్టర్ హేమంత్‌కుమార్
తాజావార్తలు
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!