బుధవారం 03 మార్చి 2021
Agriculture - Feb 05, 2020 , 22:22:25

ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచే సూచనలు

ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచే సూచనలు

లవణాల శాతం, ఎక్కువగా ఉన్న గంధకం లోపించిన భూముల్లో నత్రజనిని అమ్మోనియం సల్ఫేట్‌ రూపంలో అందించాలి.

నూనె గింజల పంటలు సాగు చేసేటప్పుడు గంధ కం ఉండే ఎరువులు సింగిల్‌ సూపర్‌ సల్ఫేట్‌, అమ్మోనియం సల్ఫేట్‌, అమ్మోనియం ఫాస్ఫేట్‌, సల్ఫేట్‌ రూపంలో అందించాలి.

అధిక వర్షపాతం ఉన్న ఆమ్ల నేలల్లో దీర్ఘకాలిక పంటల సాగులో రాతి ఫాస్ఫరస్‌ను వాడాలి.

లవణాల మోతాదు ఎక్కువగా ఉన్న నేలల్లో జింకు ఆధారిత ఎరువులు వేయాలి.

పొగాకు, ద్రాక్ష, అలుగడ్డ సాగు చేసే భూముల్లో పొటాషియం సల్ఫేట్‌ వేస్తే ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది.

పశువుల ఎరువును చివరి దుక్కికి ముందు (విత్తడానికి 4-6 వారాల ముందు)మాత్రమే నేరుగా భూమిలో వేసి కలియదున్నాలి. ఎట్టి పరిస్థితుల్లో పైపాటుగా వేయరాదు.

పచ్చిరొట్ట ఎరువులను 50 శాతం పూత దశలో భూమిలో కలిసేలా దున్నితే పోషకాల అందుబా టు పెరుగుతుంది. ఆ సమయంలో భూమిలో తేమ కచ్చితంగా ఉండాలి.

నీటి నిల్వ ఉండే వరి భూముల్లో అమ్మోనికల్‌ రూపంలో నత్రజని ఎరువును వాడితే వాటి సామ ర్థ్యం పెరుగుతుంది.

పైపాటుగా నత్రజని ఎరువులు పిచికారీ చేసేటప్పుడు యూరియా రూపంలోనే వాడాలి.

తక్కువ మొత్తంలో పిచికారీ చేస్తే యంత్రాలు వాడేటప్పుడు 20శాతం అధిక సాంద్రత వాడాలి.

జింకు లోపం ఉన్న నేలల్లో పంటను బట్టి హెక్టారు కు 10-50 కిలోల జింకు సల్ఫేట్‌ వాడాలి. 2.5-5 సెం.మీ లోతులో, విత్తనానికి 5-6 సెం.మీ రూపంలో ఫాస్ఫేట్‌ ఎరువులను వేస్తే సామర్థ్యం పెరుగుతుంది.

నీటి ద్వారా ఎరువులు అందించేటప్పుడు అన్ని ఎరువులు అందుకు అనుకూలం కాదు. యూరి యా, అమ్మోనియం నైట్రేట్‌, అమ్మోనియం సల్ఫే ట్‌, కాల్షియం అమ్మోనియం సల్ఫేట్‌, కాల్షియం అమ్మోనియం నైట్రేట్‌ మాత్రమే వాడాలి.

భాస్వరం ఎరువుల్లో ఫాస్ఫారియ ఆమ్లం, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్‌ మాత్రమే అనువుగా ఉంటాయి.

డ్రిప్‌ నీటి సాగులో పొటాషియం నైట్రేట్‌, పొటాషి యం క్లోరైడ్‌, పొటాషియం సల్ఫేట్‌, మోనో పొటాషియం ఫాస్ఫేట్‌ రూపంలో మాత్రమే వాడాలి.


డాక్టర్‌ అమరపల్లి గీత

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

వ్యవసాయ కళాశాల, పాలెం

VIDEOS

logo