బుధవారం 08 ఏప్రిల్ 2020
Agriculture - Jan 06, 2020 ,

వివిధ పంటల సాగులో చేపట్టాల్సిన చర్యలు

వివిధ పంటల సాగులో చేపట్టాల్సిన చర్యలు

వివిధ పంటలను సాగు చేస్తున్న రైతులు సమయానుకూలంగా తగిన పద్ధతులు ఆచరించాలి. తద్వారా సాగు చేసే పంటలలో ఆశించిన దిగుబడులను సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలలో వివిధ పంటలలో చేపట్టాల్సిన చర్యలను
గురించి గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త అరికెల కిరణ్‌ వివరించారు. దీనిపై మరింత సమాచారం కోసం 7893989055 నెంబర్‌లో వారిని సంప్రదించవచ్చు. వారు తెలిపిన వివరాలు..

వరి: నవంబర్‌ మాసంలో పోసిన వరి నారును ఈ నెలలో నాటు వేయాలి. రసాయనాలతో కలు పు నివారణకు గాను ఏకవార్షిక గడ్డి, తుంగజాతి కలుపు సమస్య అయినైట్లెతే బ్యూటక్లోర్‌ను హెక్టారుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్లు లేదా అనిలోగార్డ్‌ 1.25 లీటర్లు 10 కిలోల ఇసుకలో కలిపి నాటిన 3- 5 రోజులలో ఎకరా పొలంలో ఒక అంగుళం వరకు నీరు ఉంచి సమానంగా చల్లాలి. ఊద సమస్య అధికంగా ఉంటే బెంథియోకార్బ్‌ హెక్టారుకు 3 లీటర్లు 100 కిలోల ఇసుకలో కలిపి సమానంగా చల్లాలి.
ఎరువులైతే హెక్టారుకు 120 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వ రం, 40 పొటాష్‌ను ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజని మూడు సమభాగాలుగా నాట్లు వేసేటప్పుడు. నాటు వేసిన 10-12 రోజులలో, మిగిలిన మూడవభాగాన్ని అంకురార్పణ దశలో వేయాలి.
KIRAN
మక్కజొన్న:
MAIZE
యాసంగి పంటగా నవంబర్‌ 15లోగా విత్తిన మక్కజొన్న పైరు వయస్సు 30-35 రోజుల లోపు ఉన్నప్పుడు అంతరకృషి చేసి హెక్టారుకు 75 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువు వేయాలి. పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి. 30-40 రోజులున్న పంటకు అధిక నీరు హానికరం. కాండం తొలుచుపురుగు ఎక్కువగా యాసంగిలో మక్కజొన్నను ఆశిస్తుంది. పంట మొలకెత్తిన 10- 20 రోజుల నుంచి ఆశిస్తుంది. దీని నివారణకు మోనోక్రోటోపాస్‌ ఎకరాకు 320 మి. లీ.లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్నిబట్టి కార్బోప్యూరాన్‌ 3జీ గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున పంట మొలకెత్తిన 25-30 రోజులకు ఆకు సుడులలో వేయాలి.

కంది: వానకాలం పంటగా వేసిన దీర్ఘకాలిక కంది రకాలు పూత, కాయ దశలో ఉన్నందున శనగపచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి పంటను నాశనం చేస్తాయి. కాబట్టి శనగపచ్చ పురుగు నివారణకు తొలిదశలో క్లోరో పైరిఫాస్‌ 2.5 మి.లీ. లు, క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లు లేదా ఎసిఫేట్‌ను 1.5 గ్రాములతో పాటు 5 మి.లీ.ల వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందును వాడిన తర్వాత కూడా శనగపచ్చ పురుగు ప్రభావం తగ్గనైట్లెతే ఇమిడాక్సాకార్బ్‌ 1 మి.లీ. లేదా 0.3 మి. లీ. స్పైనోసాడ్‌ లేదా 0.3 మి.లీ.ల క్లోరోంట్రానిలిప్రోల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
RED-GRAM
మారుకామచ్చల పురుగు: ఈ పురుగు ఆకులను, పూతనంతా ఒక దగ్గరకు చేర్చి గూడుగా మార్చి నష్టపరుస్తుంది. దీని నివారణకు క్లోరోఫైరిఫాస్‌ 2.5 మి.లీలు+ 1 మి.లీ. డైక్లోరోవాస్‌ లీటరు నీటికి కలిపి వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పురుగు తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నైట్లెతే థయోడికార్బ్‌ 1 గ్రాము లేదా స్పైనోసాడ్‌/ ప్లూ బెండమైడ్‌ 0.3 మి.లీ.ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పల్లి:
Groundnut-peanut
అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 వరకు వేసిన పల్లి పంట ప్రస్తుతం పూతదశలో ఉన్నది. కాబట్టి చివరిసారిగా అంతరకృషి చేసి హెక్టారుకు 500 కిలోల జిప్సాన్ని 5 సెం.మీల లోతులో మొక్క దగ్గర వేసి మట్టితో ఎగదోసి నీరుపెట్టాలి.

శనగ:
rIjPux
యాసంగిలో సాగు చేసిన శనగ పంటకు ఈ నెలలో సాధారణంగా పచ్చపురుగు లేదా రబ్బరు పురుగు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. వీటి నివారణకు తొలిదశలో 2.5 మి.లీ.ల క్లోరోపైరిఫాస్‌ లేదా 2 మి.లీల క్వినాల్‌ఫాస్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే స్పైనోసాడ్‌ 0.3 మి.లీలు లేదా డై ప్యూ బెంజురాన్‌ 1 మి.లీ.లు లీటరు నీటికి కలిపి వారంరోజుల వ్యవధిలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేయాలి.

పొద్దుతిరుగుడు:
SUN-FLOWER
ఆరుతడి పంటగా నవంబర్‌లో వేయడానికి వీలుగానీ పరిస్థితులలో ఈ నెలలో విత్తుకోవచ్చు. హైబ్రిడ్‌ రకాలను సాగు చేసుకోవడం మంచిది. హైబ్రిడ్‌ రకాలలో కెబిఎస్‌హెచ్‌-44, ఎన్‌డీఎస్‌హెచ్‌-1, డీఆర్‌ఎస్‌హెచ్‌-1, ఎపిఎస్‌హెచ్‌-66 రకాలు అనువైనవి. నవంబర్‌ మాసంలో విత్తిన పంటకు విత్తిన తేదీని బట్టి 30-35 రోజులలో హెక్టారుకు 40 కిలోలను ఇచ్చే నత్రజని ఎరువులు వేయాలి.

కుసుమ:
kusuma-Crop
కుసుమ పంటకు విత్తిన 40-45 రోజుల వరకు పేను తాకిడి చాలా ప్రమాదకరమైంది. దీని నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ.లు లేదా మోనోక్రోటోపాస్‌ 1.6 మి.లీ.లు లేదా క్లోరోపైరిఫాస్‌ 2.5 మి.లీ.లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు పంట వేసిన 20 రోజుల నుంచి పూత దశ వరకు ఆశిస్తుంది. దీని నివారణకు మాంకోజెబ్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్


logo