సోమవారం 30 మార్చి 2020
Agriculture - Jan 08, 2020 , 17:05:24

ప్రయోగాలు చేస్తూ.. ఫలితాలు సాధిస్తూ

ప్రయోగాలు చేస్తూ.. ఫలితాలు సాధిస్తూ

ఎంటీయూ 1010కి ప్రత్యామ్నాయంగానే ‘ఎంటీయూ 1290’ అనే నూతన వరి వంగడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ‘మార్టేర్‌ వరి పరిశోధనా సంస్థ’ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. మొదటి సంవత్సరం చిరుసంచుల దశలో ఉన్న వరి రకం ఇది. 1010కి ప్రత్యామ్నాయంగా తయారుచేసిన వరి వంగడం ఎంటీయూ 1290. చిరు సంచుల దశలో ఉన్న ఈ వరి వంగడాలను తన పొలంలో ఉత్పత్తి చేశాడు ఈ ప్రయోగాలు చేస్తూ.. ఫలితాలు సాధిస్తూయువరైతు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ రకాన్ని రైతులు సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించవచ్చని సత్యనారాయణ తెలిపాడు. ముఖ్యంగా మన రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు ఈ వంగడం అనుకూలం. ఈ వరి రకం పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపాడు. అయితే ఎక్కువ మొత్తంలో కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఈ రకాన్ని సాగుచేయాలి.


పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని కిష్టంపేటలో కొప్పుల సత్యనారాయణ అనే రైతు. తన పొలంలో ‘ఎంటీయూ 1290’ అనే వరి పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. సత్యనారాయణ సాగు చేసిన వరి పంటలను పలువురు వ్యవసా య శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ వంగడం గురించి సత్యనారాయణ కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ ప్రాంత రైతులు దొడ్డు రకాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ తరుణంలో ఎంటీ యూ 1010కి బదులుగా ఎంటీయూ 1290 అనే వరి వంగడా న్ని మార్టేర్‌ వరి పరిశోధనా సంస్థ ఉత్పత్తి చేసి, సాగు చేసేందుకు అభ్యుదయ రైతులకు ఇచ్చింది. కాగా, తాను ఈ వరి రకాన్ని సాగు చేసి అధిక దిగుబడి సాధించినట్లు తెలిపాడు. వానకాలం, యాసంగికి అనుకూలమైన ఈ రకం ఇది. ప్రస్తుతం ఈ రకం పంట దోమ పోటును తట్టుకుని, చౌడు నేలలో సైతం అధిక దిగుబడి వస్తుందన్నారు.

చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తులకు తట్టుకునే ఈ రకాన్ని మార్టేర్‌ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు తయారుచేసినట్లు తెలిపాడు. అనేక ఆటుపోట్లను తట్టుకునే 1290 ఈ వరి వంగడం తొలి ఏడాది విజయవంతమైనట్లు తెలిపారు. దోమపోటును తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చిందన్నారు.పంట కాలం: వానకాలంలో 115 - 120 రోజుల పంట కాలం. యాసంగిలో 120 -125 రోజుల పంట కాలం. ఉల్లి కోడు తట్టుకుంటుంది. అగ్గితెగులు రాదు. నత్రజని తక్కువ అవసరం. తక్కు వ ఎరువులు వాడుకోవాలి. మెడవిరుపును తట్టుకుంటుంది. ప్రత్యేక లక్షణాలు: దొడ్డుగింజ రకం. అధిక బరువు తూగే గుణం కలిగి ఉంటుంది. పొడవైన కర్రలు కలిగి ఉండి, 10 నుంచి 13 పొడవైన గొలుసులు కలిగి ఉంటుంది. గింజ రాలే గుణం తక్కువ కలిగి ఉంటుంది. ఒక్కో గొలుసు సుమారు 250 నుంచి 300 గింజలు కలిగి ఉంటుంది. వర్షాకాలం సాగులో తక్కువ నత్రజని వినియోగం. వరి మొక్క 1010ను పోలి ఉంటుంది. సాగు విధానం: ఒక ఎకరానికి 25కిలోల విత్తన మోతాదు అవసరం. వరి నాటు నారుపోసిన 20 రోజుల నుంచి 30 రోజుల్లో నాట్లు వేసుకోవాలి. దిగుబడి: ఎకరానికి సగటున వర్షకాలంలో 26 నుంచి 28 క్వింటాళ్లు దిగుబడి, యాసంగిలో 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

ఆటుపోట్లను తట్టుకుంటుంది

ఆరుగాలం రైతులు పండించిన పంట ప్రకృతి విపత్తుల కారణంగా చేతికందకుండాపోతుంది. అందుకే వీటిని తట్టుకునే ఎంటీయూ 1290 అనే వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు.

సొంతంగా విత్తనాల తయారీ

రైతు కొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ పలు గ్రామాల రైతులు విత్తనాల ఎంపికలో సరైన అవగాహన లేక అధిక దిగుబడి సాధించలేకపోతున్నారని అన్నారు. కొంతకాలంగా శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో సొంతంగా విత్తనాలు తయారు చేస్తున్నట్లు వివరించారు. వానకాలం, యాసంగి కాలానికి తన వద్ద ఉన్న వరి విత్తనాల గురించి వివరించారు. కొంతకాలంగా తాను సొంతంగా విత్తనాలను తయారుచేస్తూ చుట్టుపక్కల రైతులకు అందిస్తున్నాని తెలిపాడు.

శాస్త్రవేత్తల సందర్శన

సత్యనారాయణ తయారుచేస్తున్న వరి వంగడాలను పలువురు భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా సంస్థ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ షేక్‌ ఎన్‌మీరా, డాక్టర్‌ శేషుమాధవ్‌, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, డాక్టర్‌ మదన్‌మోహన్‌ , జమ్మికుంట కృషి విజ్ఞాన వరి పరిశోధనా కేంద్రం శాస్తవేత్త శ్రీనివాస్‌ రావు పరిశీలించారు. భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా కేంద్రం హైదరాబాద్‌ శాస్త్రవేత్త లు సత్యనారాయణ పంట పొలంలో 18 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేసేందుకు పంటల ప్రదర్శన చేపట్టారు. సత్యనారాయణ తయారు చేస్తున్న వరి వంగడాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
-సిద్ధం సదానందం, 99498 89750

కాల్వశ్రీరాంపూర్‌ మేలు రకాల విత్తనాలతో దిగుబడి ఎక్కువ

రైతులు మేలు రకాల విత్తనాలను ఎంపిక చేసుకొని పంట సాగులో వాడుకోవాలి. విత్తనాల తయారీలో బ్రీడర్‌, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తున్నా. పొలంలో మేలైన వరివంగడాలను తీసుకొని, సంకరణం చేసి, అందులో మేలు రకాన్ని తీసుకొని, విత్త నం తయారు చేస్తున్నా. ఒక రకం విత్తనం తయారు కావాలంటే సుమారు 6 నుంచి 7 ఏండ్లు పడుతుంది. ఇంకా నూతన వరి విత్తనాలు తయారు చేయాలనేది తన ఆలోచన. పశ్చిమగోదావరి జిల్లా మార్టేర్‌ వరి పరిశోధనా స్థానం వారు ఇచ్చిన ఎంటీయూ 1290 అనే వరి విత్తనాన్ని పండించా. అధిక దిగుబడి వచ్చింది. తన వద్ద ఉన్న వరి వంగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రైతులు తనను 9908608696 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
- కొప్పుల సత్యనారాయణ


logo