e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home ఆదిలాబాద్ అన్ని వర్గాలు బాగు పడితేనే అభివృద్ధి

అన్ని వర్గాలు బాగు పడితేనే అభివృద్ధి

  • బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌
  • లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

బోథ్‌, సెప్టెంబర్‌ 14: సమాజంలోని అన్ని వర్గాలు బాగు పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి కోసం మంజూరైన చెక్కులతో పాటు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కులాల్లోని పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నదన్నారు. నియోజకవర్గం పరిధిలోని 107 మంది ఎస్సీ లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ 53.50 లక్షలు అందిస్తున్నామని పేర్కొన్నారు. బోథ్‌ మండలంలోని 17 మందికి రూ.8.50 లక్షలు, బజార్‌హత్నూర్‌లోని 12 మందికి రూ.6 లక్షలు, నేరడిగొండలోని 10 మందికి రూ.5 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. కల్యాణలక్ష్మి కింద 32 మందికి మంజూరైన రూ.32,03, 712 విలువైన చెక్కులను అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.3,20,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాథోడ్‌ ప్రకాశ్‌, మండల ప్రణాళిక అధికారి సురేశ్‌, ఎంపీపీలు తుల శ్రీనివాస్‌, రాథోడ్‌ సజన్‌, జడ్పీటీసీ డాక్టర్‌ ఆర్‌ సంధ్యారాణి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌బిన్‌సలాం, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, కన్వీనర్‌ ఎస్‌ రుక్మాణ్‌సింగ్‌, జగన్‌మోహన్‌రెడ్డి, మల్లెపూల సుభాష్‌, చట్ల ఉమేశ్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

అభివృద్ధిలో బోథ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
నియోజకవర్గ కేంద్రమైన బోథ్‌ను అభివృద్ధిలో ఆదర్శం గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ సూచించారు. ఎంపీపీ తుల శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, విద్య, వైద్య, పశువైద్యం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్‌, మహి ళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, అటవీశాఖ, ఉపాధి హామీ, గిరిజనాభివృద్ధి, రెవెన్యూ, మండల పరిషత్‌, చిన్న నీటి పారుదల, ఐకేపీ తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. గత సమావేశంలో చేసిన తీర్మానాలు, సాధించిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం మంజూరు చేస్తున్న నిధులను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో చేపట్టి పూర్తి చేయాలన్నారు.

అనంతరం జిల్లాలోనే అత్యధికంగా కరోనా వ్యాక్సినేషన్‌ చేయించిన బోథ్‌ సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ ఆర్‌ రవీంద్రప్రసాద్‌, సొనాల పీహెచ్‌సీ వైద్యుడు కే నవీన్‌రెడ్డిని సమావేశంలో సన్మానించారు. జడ్పీటీసీ ఆర్‌ సంధ్యారాణి, సహకార సంఘం చైర్మన్‌ కే ప్రశాంత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాథోడ్‌ లింబాజీ, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌బిన్‌ సలాం, ఎంపీడీవో సీహెచ్‌ రాధ, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, సీడీపీవో సౌందర్య, డీఈ శైలేందర్‌, ఎంఈవో భూమారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana