e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఆదిలాబాద్ నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఇంద్రవెల్లి, జూలై 20: మండలంలోని కెస్లాపూర్‌లో నాగోబా దేవతను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా మండలంలోని ముత్నూర్‌ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి ఫూలమాల వేశారు. ముత్నూర్‌ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్‌, అన్నబావుసాఠే చిత్రపటాలకు ఫూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కెస్లాపూర్‌కు చేరుకొని నాగో బాకు ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులతోపాటు స్థానిక సర్పంచ్‌ మెస్రం రేణుకానాగ్‌నాథ్‌, ఆదివాసీ గిరిజన, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు.

నాగోబా ఆలయ చరిత్ర ను మెస్రం వంశీయులను అడిగి తెలుసుకున్నారు. అ క్కడి నుంచి మండలకేంద్రానికి చేరుకోగా దళిత సంఘాలతోపాటు అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన ఫూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బాగా చదివి, ఉన్నత స్థానాల్లోకి వె ళ్లాలని ఆకాంక్షించారు. స మాజంలో మార్పు కోరి, ఉ ద్యోగానికి రాజీనామా చేసి, సామాన్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌చంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కు మ్ర ఈశ్వరీబాయి, సీఐ నరేశ్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎస్‌ఐ సురేశ్‌, స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, స్వేరోస్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సోన్‌ కాంబ్లే వికాస్‌, కెస్లా పూర్‌ గ్రామపటేల్‌ మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, ఆదివాసీ సంఘాల నాయకులు పుర్క బా పురావ్‌, కోడప నగేశ్‌, మెస్రం నాగ్‌నాథ్‌, కోట్నాక్‌ బారిక్‌రావ్‌, ఆత్రం అశోక్‌, దళిత సంఘాల నాయకులు శివాజీ, బాపురావ్‌, దళితానంద్‌, సత్యానంద్‌, భరత్‌, బాలా జీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఉట్నూర్‌ రూరల్‌, జూలై 20: ఉద్యోగానికి రాజీనా మా చేసిన అనంతరం గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మొదటిసారిగా జిల్లాలో మం గళవారం పర్యటించారు. దంతన్‌పెల్లి గ్రామంలో స్వే రోస్‌ జాతీయ కమిటీ సభ్యుడు కాంపెల్లి ఊశన్న గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిం చారు. స్వేరోస్‌ సభ్యు లు, నాయకులు లింగంపెల్లి చం ద్రయ్య, బిరుదుల లాజర్‌, ప్రజ్ఞశీల్‌, వెంకటేశ్‌ తదిత రులు పాల్గొన్నారు.

భవిష్యత్‌ ప్రణాళిక త్వరలో ప్రకటిస్తా..
స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్‌ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎవరికి అమ్ముడు పోలేదని, నా తుదిశ్వాస వరకు బడుగుల కోసం పోరాడుతానని స్ప ష్టం చేశారు. అధికారిగా ఉంటే న్యాయం చేయలేక పో తున్నానని, అందుకే రాజీనామా చేసి, సామాన్యుడిలా ప్రజల ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
నిర్మల్‌ అర్బన్‌, జులై 20: ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవా రం నిర్మల్‌ పట్టణానికి చేరుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వేరోస్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు.స్థానిక మినీ ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వేరోస్‌ ఆధ్వర్యంలో ప్రవీణ్‌కుమా ర్‌ను సన్మానించారు. స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌ త దితరులున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
నాగోబాను దర్శించుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ట్రెండింగ్‌

Advertisement