e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home ఆదిలాబాద్ జబర్దస్త్‌ ఫిట్‌మెంట్‌

జబర్దస్త్‌ ఫిట్‌మెంట్‌

జబర్దస్త్‌ ఫిట్‌మెంట్‌

కలిసి రానున్న 61 ఏండ్ల వయో పరిమితి పెంపు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలపై అంబరాన్నంటిన సంబురాలు
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం.. పటాకులు కాల్చి ఆనందం..
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామంటున్న ఉద్యోగులు
వచ్చే నెల 1 నుంచి పీఆర్సీ అమలు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి 30 శాతం ప్రకటించిన సీఎం కేసీఆర్‌
ఆదిలాబాద్‌, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్‌ టౌన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్నా, ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నా తెలంగాణ సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌ సిబ్బంది పక్షాన నిలిచింది. గతంలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వగా.. ఈసారి జబర్దస్త్‌గా 30 శాతం ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా సోమవారం సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసి తమ వితరణ చూపారు. పలు వరాలు కురిపించి తమది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వ మని నిరూపించారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 40వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 18 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. 15 వేల మంది పెన్షనర్లు, ఏడు వేల మంది అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. సీఎం వరాలు ప్రకటించడంతో ఉమ్మడి జల్లావ్యాప్తంగా ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.

11వ వేతన సవరణలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉ ద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రకటన వెలువడగానే ఉద్యోగులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ర్యాలీలు నిర్వహించి టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని పొగుడుతూ నినాదాలు చేశా రు. ముఖ్యమంత్రి ప్రకటించిన పీఆర్‌సీ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 18 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. 15 వేల మంది పెన్షనర్లు, 7 వేల మంది అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉన్నారు. పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లు పెంచడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. అన్ని వేళలా అండగా సీఎం కేసీఆర్‌ ఉంటున్నారని, తాము ఊహించని విధంగా వరాలు ప్రకటించారని, ఉద్యోగుల ఫ్రెం డ్లీ ప్రభుత్వానికి పేరు తీసుకొచ్చేలా విధులు నిర్వహిస్తామ ని అంటున్నారు. పెరిగిన ఫిట్‌మెంట్‌ ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని, ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసేందుకు కష్టపడుతామన్నారు.

వరాల జల్లు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లతోపాటు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీవీబీ, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏవోలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వర్క్‌ చార్ట్‌డ్‌, డెయిలీవేజ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు పెరుగనున్నాయి. అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో ప్రమోషన్లు కల్పించి ఖాళీలను నిరుద్యోగులతో భర్తీ చేయనున్నారు. రిటైర్డు ఉద్యోగులకు 15 శాతం ఇచ్చే అదనపు పింఛన్‌ వయసును 75 నుంచి 70 ఏళ్లకు తగ్గించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగులకు ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం లభించనుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులు వారి రాష్ర్టాలకు వెళ్లనున్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు సీపీఎస్‌ పెన్షన్‌ వర్తిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల, చిరుద్యోగుల పక్షాన నిలిచారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జబర్దస్త్‌ ఫిట్‌మెంట్‌

ట్రెండింగ్‌

Advertisement