e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఆదిలాబాద్ మాస్క్‌ పెట్టుకోకుంటే ఫైన్‌

మాస్క్‌ పెట్టుకోకుంటే ఫైన్‌

మాస్క్‌ పెట్టుకోకుంటే ఫైన్‌

జరిమానాలు విధిస్తున్న పోలీసులు
ప్రభుత్వ ఆదేశాలు కఠినంగా అమలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాలతో నిఘా
ఒక్కరోజే వందల సంఖ్యలో కేసులు నమోదు
మాస్కు ధరించని ఆర్టీసీ బస్సు డ్రైవర్లకూ జరిమానా
పల్లెలు, పట్టణాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు

ఎదులాపురం,ఏప్రిల్‌ 12 : మాస్క్‌ ధరించని వారికి జరి మానా విధిస్తున్నామని ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఎం. రాజేశ్‌ చంద్ర అన్నారు. పోలీస్‌ అధికారులతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మా స్కు ధరించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో పక్కా గా అమలు చే యాలన్నారు. పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు , ఐపీసీ సెక్షన్‌ కింద కేసుల న మోదుతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్ప ష్టం చేశా రు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా సంచరిస్తున్న వారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా విధించాలన్నారు. గ్రామాలు, మండలాలు, పట్టణా ల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. అవసరముంటేనే బయటకు రావాలని, భౌతిక దూరం పాటించాలని సూ చించారు. అర్హులందరూ టీకా వేసుకోవాలన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీపూరి సురేశ్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.
మాస్కు లేకుంటే జరిమానా : సీపీ సత్యనారాయణ
గర్మిళ్ల, ఏప్రిల్‌ 12 : మాస్క్‌ లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని రామగుండం పో లీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వ్యాపార సంస్థలు, దుకాణ సముదాయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 1201, రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2510 మందికి పైగా మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారిపై ఈ- పెట్టి కేసులు నమోదు చేశామని తెలిపారు. రెండు రోజుల్లో ఈ – చలాన్‌ ద్వారా 377 కేసులు నమోదు చేసి రూ.3,77,000 జరిమానా విధించామని పేర్కొన్నారు.
55 మందికి ఫైన్‌..
తాండూర్‌, ఏప్రిల్‌ 12 : తాండూర్‌ సీఐ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు మండలంలోని వివిధ గ్రా మాలు, జాతీయ రహదారిపై మాస్క్‌ ధరించని 55 మం దిపై ఈ- పెట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మాస్కు లేకుండా ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు జరిమానా విధించారు.
బస్‌ డ్రైవర్‌కు..
రెబ్బెన, ఏప్రిల్‌ 12 : మండల కేంద్రంలో మాస్క్‌ లేకుం డా తిరుగుతున్న పలువురికి ఎస్‌ఐ భవానీసేన్‌ జరిమానా విధించారు. ఆసిఫాబాద్‌ నుంచి మంచిర్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, పలువురు కారు డ్రైవర్లు మాస్క్‌ ధరించకపోవడంతో రూ. 1000 చొప్పున ఫైన్‌ విధించారు.
కౌటాలలో 8 మందికి..
కౌటాల, ఏప్రిల్‌12 : మండలకేంద్రంలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న ఎనిమిది మందికి ప్రత్యేక టీం సభ్యులు జరిమానా విధించారు. ఆర్‌ఐ దేవేందర్‌, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌ జితేందర్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి


IPL 2021: బట్లర్‌ వరుసగా 4, 4, 4, 4

చౌక‌గానే కొట‌క్ ఇంటి రుణాలు.. వ‌డ్డీ ఎంతంటే!

Advertisement
మాస్క్‌ పెట్టుకోకుంటే ఫైన్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement