e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఆదిలాబాద్ తునికాకు సేకరణకు రెడీ

తునికాకు సేకరణకు రెడీ

తునికాకు సేకరణకు రెడీ

ఆదిలాబాద్‌ జిల్లాలో 7,500
స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్‌ జిల్లాలో 4,153 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా.. 1706. 89 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లాలో ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ అటవీశాఖ డివిజన్‌ పరిధిలో దట్టమైన అడవులు ఉన్నా యి. ఉమ్మడి రాష్ట్రంలో నరికివేతకు గురైన అడవులకు పుర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతోపాటు అడవుల సంరక్షణకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండడంతో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఎండాకాలంలో గ్రామీణులు తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతారు. ఈ ఏడాది అటవీశాఖ అధికారులు తునికాకు సేకరణ ఏర్పా ట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 యూనిట్లను ఏర్పాటు చేయనుండగా ఇందుకోసం టెండర్‌ ప్రక్రియను పూర్తయింది.
7,500 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ
ఈ వేసవిలో జిల్లాలోని 7,500 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఆదిలాబాద్‌ అటవీశాఖ డివిజన్‌లో 7, ఇచ్చోడ డివిజన్‌లో 3, ఉట్నూర్‌ డివిజన్‌లో 2 యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో స్టాండర్డ్‌ బ్యాగు ధర రూ.1800 ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామాల్లో పేదలు రోజు ఉదయం ఆకును తీసుకురావడానికి అడవులకు వెళ్తారు. మధ్యాహ్నం కట్టలు కట్టి సాయంత్రం కల్లాలకు తీసుకెళ్తారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు ఈ సీజన్‌లో తునికాకు సేకరణ ద్వారా ఉపా ధి లభిస్తుంది. రోజు ఒక్కోక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌కు క‌ష్ట‌మే : తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ థియేట‌ర్ల బంద్ ?‌

సచిన్‌ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్‌ రియాజ్‌ అరెస్ట్‌

దారిత‌ప్పి బావిలోప‌డ్డ ఏనుగుపిల్ల‌.. ర‌క్షించిన అధికారులు.. వీడియో

Advertisement
తునికాకు సేకరణకు రెడీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement