e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఆదిలాబాద్ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

తాండూర్‌, జూలై 30 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవితో కలిసి లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని సీఎం కేసీఆర్‌ ఆహార భద్రత కార్డులు అందజేస్తున్నారన్నారు. మండలంలో 210 మందికి రేషన్‌ కార్డులు, 41 మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీముబారక్‌ చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కవిత, జడ్పీటీసీ సాలిగామ భానయ్య, వైస్‌ ఎంపీపీ దాగాం నారాయణ, ఎంపీటీసీలు మాసాడి శ్రీదేవి, సిరంగి శంకర్‌, మొగిలి శంకర్‌, పెర్క రజిత, సర్పంచ్‌లు, కో ఆప్షన్‌ మెంబర్‌ నజ్జీఖాన్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి మండలంలో..
కన్నెపల్లి, జూలై 30 : మండలకేంద్రంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 118 మందికి రేషన్‌ కార్డులు, 16 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, ఎంపీపీ సృజన, తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంపీడీవో శంకర మ్మ, ఎంపీటీసీ నెండుగురి భారతీ, కన్నెపల్లి సర్పంచ్‌ పుల్లూ రి సురేఖ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
నెన్నెల మండలకేంద్రంలో..
నెన్నెల, జూలై 30 : మండలకేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామలా రాంచందర్‌, ఆర్డీవో శ్యామలాదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ మల్లేశ్‌, ఆత్మ చైర్మన్‌ రాజు, కో ఆప్షన్‌ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచ్‌లు, పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana