e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఆదిలాబాద్ సమష్టిగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌

సమష్టిగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌

సమష్టిగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్న వ్యాపారులు, ప్రజలు
అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి మద్దతు

జైనథ్‌, ఏప్రిల్‌ 28: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతం అవుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ముందస్తుగా నిర్ణ యించిన మేరకు ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించారు. అనం తరం దుకాణాలు మూసివేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు బంద్‌ చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాలేదు.

బోథ్‌లో..
బోథ్‌, ఏప్రిల్‌ 28: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. బుధవారం వ్యాపారులు మధ్యాహ్నం నుంచి దుకాణాలను మూసి వేశారు. నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం1 గంట వరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తెరవడానికి అనుమతించారు. కేసులు తగ్గే వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి వ్యాపారులకు తెలపడంతో వారు లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.

భీంపూర్‌ మండలంలో..
భీంపూర్‌, ఏప్రిల్‌ 28: కరంజి(టీ), పిప్పల్‌కోటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గాలు తీర్మానించిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. పాలకవర్గం సూచించిన సమయానికే ప్రజలు తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకుంటున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. అవసరాల కోసం బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించాలని సర్పంచ్‌లు స్వాతిక, కళ్యాణి దండోరా వేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పెన్‌గంగ పరీవాహక గ్రామాలు గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, వడూర్‌, గొల్లగడ్‌, తాంసి(కే)లో మహారాష్ట్ర వాసులు రాకుండా కట్టడి చేస్తున్నారు.

మే 1 నుంచి కామట్‌వాడలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌
కామట్‌వాడలో మే 1 నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని సర్పంచ్‌ తాటిపెల్లి లావణ్య తెలిపారు. కామట్‌వాడ శివారు సరిహద్దు మూసివేస్తామని తద్వారా మహారాష్ట్ర నుంచి రాకపోకలను కట్టడి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమష్టిగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement