e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఆదిలాబాద్ చకచకా చనాక కొరాట

చకచకా చనాక కొరాట

తుది దశకు చేరిన ప్రాజెక్ట్‌ పనులు
డిసెంబర్‌ చివరికల్లా ట్రయల్న్‌
ఇప్పటికే బరాజ్‌,ప్రధాన కాల్వలు పూర్తి
ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లోని రైతుల భూములకు సాగునీరు అందించడానికి నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. బరాజ్‌, ప్రధాన కాల్వలు పూర్తికాగా, పంప్‌హౌస్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేసిట్రయల్న్‌ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగపై జైనథ్‌ మండలం కొరాట వద్ద నిర్మిస్తున్న చనాక- కొరాట ప్రాజెక్టు ద్వా రా ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లోని 52 వేల ఎకరాలకు సాగునీరుఅందనుంది. ప్రాజె క్టు నిర్మాణ పనులకు రూ.384 కోట్లను ప్రభు త్వం మంజూరు చేసింది. పెన్‌గంగ ప్రాజెక్టుకు రాష్ట్రంలో నిర్మించే కాలువలకు మహారాష్ట్రకు రూ.1,227 కోట్లను ప్రభుత్వంకేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పను లు పూర్తి చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బరాజ్‌, ప్రధాన కాలువల పనులు పూర్తి కాగా,పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నా యి. 0.98 టీఎంసీల నీటి నిల్వ చేసే బరాజ్‌ పనులు పూర్తయ్యాయి. 23 ఫిల్లర్లు నిర్మించడంతో పాటు గేట్లు బిగించారు. రెండుఅబట్‌మెంట్స్‌ నిర్మాణాలు పూర్తికాగా రిజర్వాయర్‌కు మహారాష్ట్ర వైపు గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు పూర్తయ్యాయి.వీటితో పాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెస ర్‌ మెయిన్స్‌కు సంబంధించి 4 కిలోమీటర్లకు గానూ 3 కిలోమీటర్ల పైపులు వేశారు.

వేగంగా పంప్‌హౌస్‌ పనులు
రిజర్వాయర్‌లోని నీటిని కాలువల్లోకి ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఇందు కు సంబంధించిన కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌస్‌ మోటర్లు నడిచేందుకు విద్యుత్‌

- Advertisement -

సబ్‌స్టేషన్‌ కూడా నిర్మించారు. మెట ర్లు బిగించడం, డెలీవరీ పైప్స్‌ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ పనులను వేగంగా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉ న్నతాధికారులునిరంతరం పనులను పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. డిసెంబరు చివరి నాటికి ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు నిర్మాణ పను ల్లో వేగం పుంజుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ప్రా జెక్టు నిర్మాణం ద్వారా రైతులు రెండు పంటలు సాగుచేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు పలు గ్రామాల్లో భూగర్భజల నీటి మ ట్టం పెరిగి తాగునీటికి ఇబ్బందులుఉండవు. మత్య్సకారులకు చేపలు పెంచుకొని ఉపాధి మెరుగుపర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.

డిసెంబర్‌లో ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంప్‌హౌ స్‌ పనులు వేగంగా నిర్వహిస్తున్నాం. కాం క్రీటు పనులు పూర్తికాగా, డెలివరీ మె యి న్స్‌, ఎలక్ట్రికల్‌, ఇతర ప నులు జరుగాల్సి ఉంది. అధికారులు, సిబ్బంది పనులను క్ర మంగా పర్యవేక్షిస్తున్నా రు. డిసెంబరు చివరిలోగా పంప్‌హౌస్‌ ట్రయల్న్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

  • రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, చనాక-కొరాట ప్రాజెక్ట్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement