ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Adilabad - Jan 27, 2021 , 01:17:26

అన్ని వర్గాల ఉన్నతికి రాజ్యాంగం

అన్ని వర్గాల ఉన్నతికి రాజ్యాంగం

ఎదులాపురం,జనవరి26: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అన్ని వర్గాల ఉన్నతి కోసం రాజ్యాంగాన్ని రచించారని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌, మహాప్రజ్ఞ బుద్ధ విహార్‌ అభివృద్ధి కమిటీ, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పంచశీల ధ్వజారోహణ దమ్మ వందనం జరిపారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్‌ ద్వారానే నేడు తెలంగాణలో పాలన సాగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సోగల సుదర్శన్‌, రత్నజాడే ప్రజ్ఞకుమార్‌, శైలేందర్‌, రాజుమస్కే, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo