మురిసిన మువ్వన్నెల జెండా

- జెండా ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
ఎదులాపురం, జనవరి26: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, టీఆర్ఎస్ పార్టీ, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కోర్డులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్, జడ్పీ కార్యాలయ ఆవరణలో జడ్పీ సీఈవో కిషన్, జిల్లా వైద్యారోగ్య శాఖలో డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో శ్రీనివాస్, యాపల్‌గూడ రెండో బెటాలియన్‌లో కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, ఐసీడీఎస్‌లో పీడీ మిల్కా, బీసీ కార్యాలయంలో ఆశన్న, జిల్లా రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్, మున్సిపల్ కార్యాలయం, పాతబస్టాండ్ వద్ద మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
బేల, జనవరి26: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డి, మండల పరిషత్‌లో ఎంపీపీ వనిత ఠాక్రే, బేల గ్రామ పంచాయతీలో సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సిరాజ్‌ఖాన్, ఎమ్మార్సీలో ఎంఈవో కోల నర్సింహులు, ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ క్రాంతికుమార్, ఐకేపీలో ఏపీఎం కిరణ్‌కుమార్, వ్యవసాయ శాఖలో ఏఈవో రమణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
జైనథ్, జనవరి26: మండల కేంద్రంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ అరుంధతి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయిరెడ్డి వెంకన్న, మార్కెట్ కార్యాలయంలో సాయిరెడ్డి మధూకర్, వ్యవసాయ శాఖలో ఏవో వివేక్, ఐకేపీలో ఏపీఎం చంద్రశేఖర్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మహేంద్రనాథ్, ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు.
యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం
ఉట్నూర్/ఉట్నూర్ రూరల్, జనవరి 26: ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్, మహాత్మాగాంధీ, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ నుంచి కనక రాజును కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే ఫారెస్ట్ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి ఎఫ్ఆర్వో అనిత మొక్కలు నాటారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఇంద్రవెల్లి, జనవరి26: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగ్నాథ్, మండల పరిషత్‌లో ఎంపీడీవో పుష్పలత, గ్రంథాలయంలో ఎంపీపీ శోభాబాయి, ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి రాజేశ్వర్, పీఏసీఎస్‌లో చైర్మన్ మారుతీడొంగ్రే, ఇంద్రవెల్లి పీహెచ్సీలో డాక్టర్ శ్రీకాంత్, పిట్టబొంగురం పీహెచ్సీలో శ్రీధర్, పశువైద్యశాలలో డాక్టర్ సుదేశ్, అటవీ శాఖలో ఎఫ్ఆర్వో శ్రీనివాస్, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ, అంబేద్కర్ చౌక్‌లో సర్పంచ్ కోరెంగా గాంధారి, జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అమ్జద్, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్ పాల్గొన్నారు.
నార్నూర్,జనవరి26: నార్నూర్, గాదిగూడ మండలాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, పంచాయతీ, పలు శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్‌లు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఎండీ జాకీర్, మోతీరాం, ఎంపీడీవోలు రామేశ్వర్, రమేశ్, నార్నూర్ సీఐ వీవీ రమణమూర్తి, ఎస్ఐలు విజయ్‌కుమార్, సయ్యద్ ముజాహిద్, ఎంఈవో ఆశన్న, ఎంపీపీలు కనక మోతుబాయి, ఆడ చంద్రకళ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్ ,జనవరి 26: ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి సుమనస్పతిరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో డీవీఎం రమేశ్, డిపోలో ఎస్ జనార్దన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
తాజావార్తలు
- వనపర్తి జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య
- జాన్వీ టాలీవుడ్ డెబ్యూపై స్పందించిన బోని కపూర్
- శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
- బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చచ్చిపోవాలని అనిపించేది: మేఘన్
- హై ఫిల్టర్ మాస్క్‌లో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ నరేంద్ర
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్
- కుమారుడిని పరిచయం చేసిన కరీనా
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్