గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే జోగు రామన్న
బేల, జనవరి 25: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం పొనాలలో శ్మశాన వాటిక, గ్రామ పార్కుతో పాటు పోచమ్మ ఆలయాన్ని మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఏకోరి గ్రామంలో రూ.3 లక్షలతో చేపడుతున్న బస్‌షెల్టర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్ యశోద, నాయకులు ఇంద్రశేఖర్, తేజ్‌రావు, జక్కుల మధూకర్ పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పొనాల గ్రామంలో మండల నాయకులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
బాజీరావ్ బాబాను ఆదర్శంగా తీసుకోవాలి..
ఆదిలాబాద్ రూరల్, జనవరి 25: బాజీరావ్ బాబాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని అర్లి(బీ)లో నిర్వహిస్తున్న సప్తాహ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్