సోమవారం 08 మార్చి 2021
Adilabad - Jan 24, 2021 , 01:42:35

ఈడబ్ల్యూఎస్‌ ఆనందహేల

ఈడబ్ల్యూఎస్‌ ఆనందహేల

  • నేరడిగొండ ఎంపీపీ సజన్‌
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నేరడిగొండ, జనవరి23: తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎంపీపీ సజన్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీపీ చాంబర్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్యేషన్లు అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్‌ పెంట వెంకటరమణ, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉట్నూర్‌, జనవరి 23: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్‌ చౌక్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్‌ సభ్యుడు సయ్య ద్‌ రషీద్‌, నాయకులు సీతారాం, అన్సారి, సతీశ్‌, రాజ్‌కుమార్‌, రవి పాల్గొన్నారు.

బోథ్‌, జనవరి 23: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి  రిజర్వేషన్లు అమలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎస్‌ రుక్మణ్‌సింగ్‌, ఏఎంసీ చైర్మన్‌ భోజన్న, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సురేందర్‌యాదవ్‌, ఉపాధ్యక్షుడు బాబుసింగ్‌, వైస్‌ఎంపీపీ లింబాజీ, సోలంకి సత్యనారాయణ, శ్రీకాంత్‌, ఉమేశ్‌, వెంకటేశ్‌, గోపి, సుభాష్‌, రఫి, రమేశ్‌ పాల్గొన్నారు. 

ఇచ్చోడ, జనవరి 23: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పాట్కూరి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సీనియర్‌ నాయకులు ఏనుగు కృష్ణారెడ్డి, దాసరి భాస్కర్‌, వెంకటేశ్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, పురుషోత్తం రెడ్డి, సురేందర్‌ రెడ్డి, గంగారెడ్డి, ముస్తాఫా పాల్గొన్నారు.  

సిరికొండ,జనవరి23: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాలాజీ, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ రాజారాం, మాజీ సర్పంచ్‌ బషీర్‌, నాయకులు శంకర్‌, అశోక్‌, శివశంకర్‌ పాల్గొన్నారు.

భీంపూర్‌, జనవరి23: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అగ్రవర్ణాల పేదలకు మేలు కలుగుతుందని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌ అన్నారు. మండల కేంద్రంలో అగ్రవర్ణాల పేదలు, టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మేకల నాగయ్యయాదవ్‌, సర్పంచ్‌లు మడావి లింబాజీ, భూమన్నదొర, నాయకులు నరేందర్‌యాదవ్‌,  నరేందర్‌రెడ్డి, చింతల శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు గంగారెడ్డి, నితిన్‌, మహేందర్‌, అనిల్‌, పాల్గొన్నారు.

తలమడుగు, జనవరి 23: సుంకిడి గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ వెల్మ శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌ గెల్ల మహేందర్‌ యాదవ్‌, నాయకులు తోట వెంకటేశ్‌, కాటిపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఆశన్న యాదవ్‌, మగ్గిడి ప్రకాశ్‌, కంది నర్సింహులు, జావిద్‌, కాటిపెల్లి సునీత రెడ్డి, ఎలుగు చంటి, పోతారెడ్డి పాల్గొన్నారు. 

గుడిహత్నూర్‌,జనవరి23: మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎస్కే జమీర్‌, మన్నూర్‌ ఎంపీటీసీ కేంద్రె న్యాను, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జంగు, డైరెక్టర్లు దిలీప్‌, సంగ ఆశన్న, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌, నాయకులు సత్యరాజ్‌, పాటిల్‌ రాందాస్‌, రావణ్‌ముండె, సతీశ్‌, గంగన్న  పాల్గొన్నారు.   

VIDEOS

logo