నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ‘కళా ఉత్సవ్'

కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం,జనవరి16 : విద్యార్థుల్లోని కళానైపుణ్యాన్ని వెలికి తీసేందుకే కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 15న రాష్ట్ర విద్య పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కళా ఉత్సవ్లోలో పాల్గొని ప్రతిభ చాటిన జిల్లా విద్యార్థులను కలెక్టరేట్లో శనివారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శ్రీజ జానపద గీతాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతితో పాటు రూ.3వేల నగదు బహుమతి, గుడిహత్నూర్ మండలం మన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కే.సునీల్ జానపద నృత్య విభాగంలో రెండో బహుమతితో పాటు రూ.2 వేల నగదు బహుమతి సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఈవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ప్రతి పాదనలను వెంటనే సమర్పించాలి
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలు, కారుణ్య నియామకాల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగోన్నతులు, నియామకాలు చేపట్టనున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్, ఖాళీల వివరాలు నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!