సోమవారం 08 మార్చి 2021
Adilabad - Jan 17, 2021 , 01:43:49

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి

విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముం దుకు సాగాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో నాలుగు రోజులుగా నిర్వ హిస్తున్న అండర్‌-14 క్రికెట్‌ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న దన్నారు. అనంతరం విజేత వరంగల్‌కు, ద్వితీయ స్థానం సాధించిన ఆదిలాబాద్‌జట్టు క్రీడాకారులకు మెడల్స్‌, షీల్డ్‌ అందించారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జహీర్‌ రంజానీ, ఫ్లోర్‌లీడర్‌ బండారి సతీశ్‌, టీసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి, మహిళా క్రికెట్‌ సంఘం అధ్యక్షురాలు చిట్యాల సుహాసినీరెడ్డి, టీసీఏ జిల్లా కార్యదర్శి నరోత్తంరెడ్డి, జిల్లా పేటా సంఘం అధ్యక్షుడు పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు. అంత కుముందు ఫైనల్‌ మ్యాచ్‌ను ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ప్రారంభించారు.  

VIDEOS

logo