మంగళవారం 09 మార్చి 2021
Adilabad - Jan 17, 2021 , 01:43:49

పనులు వేగవంతం చేయాలి

పనులు వేగవంతం చేయాలి

  • ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ రూరల్‌, జనవరి 16 : నియోజకవర్గంలో చేపట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాల ని సూచించారు. నత్తనడకన ఇండ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులివ్వాలని ఆ దేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారి సురేశ్‌, పంచాయతీ రాజ్‌ అధికారి రఫత్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo