బుధవారం 27 జనవరి 2021
Adilabad - Jan 14, 2021 , 00:44:05

మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

ఎదులాపురం, జనవరి13 : చెరువుల్లో చేపలు పట్టేందుకు వీలుగా 18 ఏండ్లు నిండిన ముదిరాజ్‌ యువకులకు మత్స్యశాఖ ద్వారా సభ్యత్వం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొజ్జ నారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక తెలంగాణ చౌక్‌లో బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు సలేందర్‌ శివయ్య, సంఘం నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెన లస్మన్న, కార్యదర్శులు పాండురంగ్‌, పొచ్చన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సలేంద్ర సుధాకర్‌, పట్టణ అధ్యక్షుడు గంగన్న, మత్స్యశాఖ అధ్యక్షుడు నరుకుడి అశోక్‌, కొండ వెంకటి, గౌరవాధ్యక్షుడు ఇండ్ల గణేశ్‌, రాములు, సంతోష్‌, శ్రీకాంత్‌, విజయ్‌ పాల్గొన్నారు.


logo