ఆదివారం 07 మార్చి 2021
Adilabad - Dec 31, 2020 , 02:42:38

పల్లె ప్రగతి పనుల్లో నాణ్యత పాటించాలి

పల్లె ప్రగతి పనుల్లో నాణ్యత పాటించాలి

  •  ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌
  • పనుల పురోగతిపై మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం

ఎదులాపురం : పల్లెప్రగతి కార్యక్రమం కింద గ్రామా ల్లో చేపట్టిన పనులకు, నివేదికల్లోని అంశాలకు వ్యత్యా సం ఉందని, పనుల్లోనూ నాణ్యత పాటించడంలేదని గమనించినట్లు ఆదిలాబాద్‌ స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో సెగ్రిగేషన్‌ షెడ్‌, శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, కల్లాలు, మరుగుదొడ్ల నిర్మాణాలపై మండలస్థాయి అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర పర్యటనలు నిర్వహిస్తున్నప్పుడు పల్లె ప్రగతి పనుల్లో నాణ్యత లేదని, నివేదికల్లోనూ వ్య త్యాసాలు ఉన్నట్లు గమనించామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలన్నారు. శ్మశాన వాటికల నిర్మాణాలకు సంబంధించి వేచి ఉండే గది, స్నానపు గదు లు, దింపుడు కల్లం, ఆర్చ్‌ వంటి నిర్మాణాలు పూర్తవ్వాలని తెలిపారు. సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను నాటాలన్నారు. జిల్లాలో 2,23 4 కల్లాలకు గాను సుమారు 1,076 గ్రౌండింగ్‌ కాగా, 88 పూర్తయినట్లు నివేదికల్లో ఉందని తెలిపారు.

 గ్రామీణ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం కింద మిగిలిఉన్న 765 నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో కిషన్‌, పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, పంచాయతీరాజ్‌ ఈఈ మహవీర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవో, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo