మంగళవారం 09 మార్చి 2021
Adilabad - Dec 31, 2020 , 02:42:38

‘పనులపై సీఎం ఆదేశం’

‘పనులపై సీఎం ఆదేశం’

భైంసా : నియోజకవర్గంలో చేపడుతు న్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి పలు అంశాల గురించి ప్రస్తావించగా, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. 6 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన పిప్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను చేపట్టాలని, గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన 10 కిలోమీటర్ల పోడవు సీసీ కెనాల్‌ను సత్వరమే పూర్తి చేయాలని, అర్లి వంతెన కూలిపోయే దశలో ఉన్నందున పునర్నిర్మాణం చేపట్టాలని, గుండెగాం గ్రామం ముంపునకు గురవుతున్నందున నిర్వాసిత సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను అదేశించినట్లు వెల్లడించారు.


VIDEOS

logo