లండన్: అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ 378 పరుగులు చేసింది. లార్డ్స్‌లో అరంగేట్రం చేస్తూ ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో భారత మాజీ కెప్టెన్ గంగూలీ (131) పేరిట ఈ రికార్డు ఉంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. బర్న్స్ (59), రూట్ (42) క్రీజులో ఉన్నారు.