మంగళవారం 02 మార్చి 2021
Adilabad - Dec 09, 2020 , 01:37:17

కార్పొరేట్లకు కోమ్ముకాస్తున్న బీజేపీ

కార్పొరేట్లకు కోమ్ముకాస్తున్న బీజేపీ

  • ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, అఖిల పక్ష పార్టీల నాయకులు 
  • అన్ని మండలాల్లో విజయవంతంగా ‘భారత్‌ బంద్‌'
  • స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలు

జైనథ్‌ : నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ రైతుల నడ్డి విరుస్తున్నదని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జైనథ్‌ మండలంలోని బోరజ్‌ జాతీయ రహదారిపై భారత్‌ బంద్‌లో భాగంగా  రైతులు చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి బైక్‌ ర్యాలీ తీసి, ధర్నాలో పాల్గొన్నారు.  బస్టాండ్‌ సమీపంలో గల జాతీయ రహదారిని అఖిల పక్షం నాయకులు దిగ్బంధించారు. ఈ కార్యక్రమాల్లో లో మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, యూనిస్‌ అక్బాని, ఏఎంసీ చైర్మన్‌ మెట్టుప్రహ్లాద్‌, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్‌ తల్లెల చంద్రయ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రంగినేని మనీషా, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ఊశన్న, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పెందూర్‌ దేవన్నలతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

-ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు

తలమడుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు డిమాండ్‌ చేశారు. సుంకిడి గ్రామంలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌, సీపీఎం, సీఐటీయూ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారిపై తలమడుగు, తాంసి మండలాల రైతులు చేపట్టిన రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి, సర్పంచ్‌ మహేందర్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ కల్యాణం రాజేశ్వర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, నాయకులు గెల్ల వెంకటి, తోట వెంకటేశ్‌, కాటిపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, సునీతారెడ్డి, సదాశివ్‌, శేర్ల పొచ్చన్న, మగ్గిడి ప్రకాశ్‌, ఆశన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బేల :కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉప సంహరించుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌ డిమాండ్‌ చేశారు. బేల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గంభీర్‌ఠాక్రే, జక్కుల మధుకర్‌, సతీశ్‌పవార్‌, ప్రమోద్‌రెడ్డి, రఘుకుల్‌రెడ్డి, మస్కే తేజ్‌రావు, ఇంద్రశేఖర్‌, బండి సుదర్శన్‌, సుధాంరెడ్డి, దేవన్న, సంతోష్‌ బెదుల్కర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఫయజుల్లాఖాన్‌, రాందాస్‌ నాక్లే, రూప్‌రావు, భాస్కర్‌ ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు 

బజార్‌హత్నూర్‌ : బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని జిల్లా రైతు సంఘం సభ్యుడు చిల్కూరి భూమయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు, రైతులు బజార్‌హత్నూర్‌-ఇచ్చోడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాజారాం, నాయకులు సాయన్న, భాస్కర్‌రెడ్డి, మధుకర్‌, సూది నందు, తాండ్ర పోతన్న, ప్రభు, జగదీశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: గుడిహత్నూర్‌ మండల కేంద్రం లో జాతీయ రహదారిపై వివిధ పార్టీల నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, మండల టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌, ఎంపీటీసీలు, న్యాను, శగీర్‌ఖాన్‌, మాజీ జడ్పీటీసీ కేశవ్‌ గిత్తె, జిల్లా, మండల నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, జాదవ్‌ రమేశ్‌, నారాయణ, సంగ ఆశన్న యాదవ్‌, సంతోష్‌గౌడ్‌, పాటిల్‌ రాందాస్‌, సర్పే సోంబాయి, జ్యోతి, కేంద్రె మాధవ్‌, ఫడ్‌ దిలీప్‌, దోమకొండ సుధాకర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంకతి రవీందర్‌, బాలాజీ సోన్‌టేక్‌, ఎంఐఎం నాయకుడు ఆర్షద్‌, తదితరులున్నారు.   

ఉట్నూర్‌ : టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగారే భరత్‌, ఎంపీపీల ఆధ్వర్యంలో పంద్ర జైవంత్‌రావు బస్టాండ్‌ ఎదుట ధర్నా చేశారు. అంబేద్కర్‌ చౌక్‌లో కాంగ్రెస్‌ నాయకులు భరత్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ సామ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలాజీ, మండల అధ్యక్షుడు సింగారే భరత్‌, మాజీ మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్‌, పోషన్న, రెడ్డి శ్రీధర్‌, రాథోడ్‌ శ్యాం, నారాయణ, ధరణి రాజేశ్‌, ప్రజ్ఞశీల్‌,  రాజ్‌కుమార్‌, అన్సారి పాల్గొన్నారు.

సిరికొండ : మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బంద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సూర్యకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బత్తిని అశోక్‌, కంద సూర్యకాంత్‌, రాజారాం, బాలాజీ, బషీర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి : మండలకేంద్రంలో బైక్‌ ర్యాలీ తీసి, రాస్తారోకో చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు కనక తుకారామ్‌, ఎండీ మసూద్‌, మారుతీడొంగ్రే, శివాజీ సర్కాళే, దేవ్‌పూజె మారుతీ, రాథోడ్‌ మోహన్‌నాయక్‌, వసంత్‌రావ్‌, దిలీప్‌మోరే, షేక్‌ సుఫియాన్‌, ఎంఏ అమ్జద్‌, జావిద్‌, రాజ్‌వర్ధన్‌, ఈశ్వరీబాయి, నగేశ్‌, హరిదాస్‌, రాజేశ్వర్‌, హనుమంత్‌రావ్‌, బాబు ముండే, రామ్‌దాస్‌, సుంకట్‌రావ్‌, దూద్‌రామ్‌, పప్పేస్‌బన్సోడే, ఆత్రం ధర్ము, తదితరులు పాల్గొన్నారు.

నార్నూర్‌ : మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ మండిపడ్డారు. భారత్‌ బంద్‌ లో భాగంగా మంగళవారం నార్నూర్‌లోని గాంధీచౌరస్తా, గాదిగూడలోని కుమ్రం భీమ్‌ చౌరస్తా వద్ద ప్రతిపక్ష నాయకులు, రైతులు నిరసన తెలిపారు.  నార్నూర్‌, గాదిగూడలో బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైంది. నార్నూర్‌లో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌కాంబ్లే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు కనక మోతుబాయి, ఆడ చంద్రకళ, వైస్‌ ఎంపీపీ యోగేశ్‌, సర్పంచ్‌లు బానోత్‌ గజానంద్‌నాయక్‌, మెస్రం జైవంత్‌రావ్‌, ఇంద్రవెల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావ్‌, లొకండే చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌, వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

బోథ్‌:  బోథ్‌, సొనాల తదితర గ్రామాల్లో వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బోథ్‌-కిన్వట్‌ అంతర్రాష్ట్ర రహదారిపై పొచ్చెర క్రాస్‌రోడ్డు వద్ద టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ  నాయకులు, రైతులు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ ఎస్‌ రుక్మణ్‌సింగ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌బిన్‌సలాం, బోథ్‌ సహకార సంఘం చైర్మన్‌ కే ప్రశాంత్‌, ఆత్మ చైర్మన్‌ ఎం సుభాష్‌, కాంగ్రెస్‌  నాయకులు బీ మల్లేశ్‌, ఎం సత్యనారాయణ, కే మహేందర్‌, షేక్‌ నాసర్‌అహ్మద్‌, జే శ్రీధర్‌రెడ్డి, షంశొద్దీన్‌, సీపీఐ నాయకులు బీ గోవర్ధన్‌, దాస్‌, షాకీర్‌, దాస్‌, రవి, టీఆర్‌ఎస్‌ నాయకులు జీ దివాకర్‌రెడ్డి, ఆర్‌ లింబాజీ, జుగదిరావు, విజయ్‌, బాబుసింగ్‌, శ్రీధర్‌రెడ్డి, రాయలు, రాజారెడ్డి, వెంకటరమణారెడ్డి, సంజీవ్‌రెడ్డి, రమణాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇచ్చోడ :  ఇచ్చోడలో చేపట్టిన రాస్తారోకోలో  టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం నాయకులు పాట్కూరి శ్రీనివాస్‌ రెడ్డి, గాడ్గె సుభాశ్‌,  మేరాజ్‌, దాసరి భాస్కర్‌, వెంకటేశ్‌, గ్యాతం గంగయ్య, జాహేద్‌, షాదుల్లా, సాబీర్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, అబ్దుల్‌ రషీద్‌, తదితరులు పాల్గొన్నారు.  

తాంసి : తాంసి మండల కేంద్రంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకంటి మంజూల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పులి నారాయణ, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సామ నాగారెడ్డి, అరుణ్‌కుమార్‌, గంగాధర్‌గౌడ్‌, సర్పంచులు వెంకన్న, గజానంద్‌, శంబు, యశ్వంత్‌, ఎంపీటీసీలు అశోక్‌, రఘు, నాయకులు గంగారాం, శ్రీనివాస్‌ , కాంత్‌రెడ్డి, ధనుంజయ్‌, దేవేందర్‌, దయానంద్‌, భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నేరడిగొండ : మండలం కేంద్రంలోని జాతీయ రహదారిపై మండల రైతులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, పార్టీ మండల కన్వీనర్‌ అల్లూరి శివారెడ్డి, బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దావుల భోజన్న, నేరడిగొండ సర్పంచ్‌ పెంట వెంకటరమణ, కుమారి పీఏసీఎస్‌ చైర్మన్‌ మందుల రమేశ్‌, మండల రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భీంపూర్‌: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ మేకల నాగయ్య, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్‌  టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నాయి.. 

ఆదిలాబాద్‌ రూరల్‌: మండలంలో వివిధ పార్టీల మండల నాయకులు గ్రామాల నుంచి వచ్చిన ర్యాలీల్లో పాల్గొన్నారు.


VIDEOS

logo