ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Adilabad - Dec 08, 2020 , 00:32:45

రాష్ట్రానికే గర్వకారణం ముక్రా (కే)

రాష్ట్రానికే  గర్వకారణం ముక్రా (కే)

  •  సర్పంచ్‌, ఎంపీటీసీని అభినందించిన సీఎం కేసీఆర్‌

ఇచ్చోడ : వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేసిన ముక్రా (కే) గ్రామం రాష్ర్టానికే గర్వకారణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్‌ సోమవారం సాయంత్రం  ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంపై సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్‌ను సీఎం అభినందించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్న తొలి గ్రామంగా నిలువడం అభినందనీయమన్నారు. గ్రామ స్వరాజ్య సాధనలో ముక్రా (కే) జీపీ ఇతర జీపీలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్న గ్రామస్తులకు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముక్రా (కే) గ్రామానికి ప్రత్యేక అవార్డును ప్రకటించి, వచ్చే ఏడాది 2021 జనవరి 26న అందజేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును సీఎం ఆదేశించారు. ఈ నెల 10న మినీ జాబ్‌ మేళా 

మంచిర్యాల అగ్రికల్చర్‌ :  ఈ నెల 10 న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మినీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్‌ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్‌, ఆ పై విద్యనభ్యసించిన వారు అర్హులని, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఫొటో, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లతో హాజరు కావాలని కోరారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13 వేల వేతనంతో పాటు ఇన్సెంటివ్‌ ఉంటాయని, జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99510 40181లో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. 

VIDEOS

logo