సోమవారం 18 జనవరి 2021
Adilabad - Dec 06, 2020 , 01:50:40

వైభవంగా లక్ష్మీనారాయణస్వామి రథోత్సవం

వైభవంగా  లక్ష్మీనారాయణస్వామి  రథోత్సవం

  • వేలాదిగా  తరలివచ్చిన భక్తులు
  • మార్మోగిన జైనథ్‌ వీధులు
  •  కిక్కిరిసిన ఆలయ  పరిసరాలు

జైనథ్‌ : శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భా గంగా కార్తీక బహుళ పంచమిని పురస్కరించుకొని రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది. ముం దుగా రథం వద్ద నాగబలి, పుష్పయాగం, గ్రామబలి ఇత్యాధి కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ‘జై శ్రీమన్నారాయణ’ అంటూ రథాన్ని ముందుకు కదిలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయం కుడి ద్వారం నుంచి ఈ రథం ఎదుట వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు భజన సంకీర్తన, కోలాటం ఆడారు. డప్పు చప్పుళ్ల మధ్య రథయాత్ర కొనసాగింది. రథం ముందర లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఉన్న అతి పురాతనమైన బలియాలను చేతబట్టుకొని భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు ప్యాలాలు చల్లుకుంటూ రథాన్ని దర్శించుకున్నారు. ఈ రథాన్ని స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వరకు భక్తులు నెడుతూ ముందుకు సాగారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ ప్రత్యేక మండపం (పందిరి)ను ఏర్పాటు చేయగా.. దాన్ని రథం ఢీకొట్టడంతో రథోత్సవ కార్యక్రమం ముగిసినట్లు భావిస్తారు. ఈ రథం ప్రారంభం నుంచి చివరి వరకు యుద్ధంలో ఇతర సైనికులపై దండెత్తినట్లు తలపిస్తుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్ర, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, యవత్‌మాల్‌, తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, జైనథ్‌ ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ ఎస్‌.లింగారెడ్డి, స్థానిక సర్పంచ్‌ దుమాల దేవన్న, ఎంపీటీసీ లస్మన్న, బీజేపీ జిల్లా నాయకుడు లోక ప్రవీణ్‌రెడ్డి, ఆలయ కమిటీ ఈవో రాజేందర్‌, అసిస్టెంట్‌ రాజమౌళి, స్థానిక నాయకులు వెంకట్‌రెడ్డి, అల్లూరి అశోక్‌రెడ్డి, సామ రమేశ్‌రెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 

సత్యనారాయణ వ్రత పూజల్లో  ఎమ్మెల్యే దంపతులు


జైనథ్‌ : జైనథ్‌ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలో పాల్గొన్నారు. ఆలయ కమి టీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు సాదరంగా స్వాగ తం పలికి జ్ఞాపికలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ ఎస్‌.లింగారెడ్డి, సర్పంచ్‌ దేవన్న, తదితరులు పాల్గొన్నారు.