దవాఖానల్లో పౌష్టికాహారం

- గర్భిణులకు అందించిన ఐసీడీఎస్ సిబ్బంది, వైద్యులు
దిలావర్పూర్ : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని గర్భిణులు వినియోగించుకోవాలని పీహెచ్సీ డాక్టర్ శ్యాంకుమార్ సూచించారు. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం లో గర్భిణులకు పౌష్టికాహారం అందజేసే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసూతీ సేవలు పొందాలని, ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరేశ్ కుమార్, రైతు బంధు సమితి సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో గడ్డం మోహన్ రెడ్డి, ఎంపీటీసీ పాల్దే అక్షర, అంగన్వాడీ సూపర్ వైజర్ రజినీ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో..
చెన్నూర్ : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చెన్నూర్ సర్కారు దవాఖానలో గర్భిణులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి సోమ, గురు, శుక్రవారాల్లో గర్భిణులకు దవాఖానలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకపై పౌష్టికాహారం అం దించనున్నట్లు సీడీపీవో మనోరమ తెలిపారు. సూపర్వైజర్ రాణి, టీచర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు