శనివారం 23 జనవరి 2021
Adilabad - Dec 04, 2020 , 01:02:33

పరీక్షలు పెరిగినయ్‌..

పరీక్షలు పెరిగినయ్‌..

  • ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో పెరుగుతున్న కరోనా  కేసులు
  • ప్రతి రోజూ 1300-1,800 మందికి పరీక్షలు
  • అధికారుల పకడ్బందీ చర్యలు.. నిబంధనలు పాటించాలని సూచన

ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో కొవిడ్‌-19 పరీక్షలు పెరిగాయి. అదేస్థాయిలో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.  ప్రతి రోజూ 1300-1800 మందికి ర్యాపిడ్‌ యాంటి జెన్‌ పరీక్షలు చేస్తున్నారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 25 కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తొమ్మిది మొబైల్‌ టీంలను ఏర్పాటు చేసి విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

- ఆదిలాబాద్‌/మంచిర్యాల, నమస్తే తెలంగాణ 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గింది. 2 నెలలుగా రోజు 5 నుంచి 10 కేసులు నమోదవుతుండగా బుధవారం ఒక్కరోజే 25 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.  జిల్లాలో ఇప్పటి వర కు 1,33,332 మందికి పరీక్షలు నిర్వహించగా 4423 మం దికి పాజిటివ్‌ రాగా 1,28,909 నెగెటివ్‌గా నిర్ధారణ అ య్యింది. 4261 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తు తం 122 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  దీంతో అప్రమత్తమై న వైద్యశాఖ అధికారులు ఎలాంటి లక్షణాలు లేకున్నా పట్టణాలు, గ్రామాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 9 మొబైల్‌ టీంలను ఏర్పా టు చేశారు. ఒక్కో బృందంలో వైద్యుడితో పాటు ఇద్దరు సిబ్బంది ఉం టారు. ప్రతి టీంకు వాహనాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 104 వాహనంలో రద్దీ ప్రాంతాలు, స్లమ్‌ ఏరియాల్లో, 8 ఆర్‌బీఎస్‌కే వాహనాల ద్వారా గ్రామా ల్లో ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తాయి.

రోజు 1800 మందికి పరీక్షలు

వైరస్‌ నివారణకు రోజు 1800 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  పాజిటివ్‌ వచ్చిన వారికి హోం ఐసొలేషన్‌లో ఉంటే వారికి కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నారు. హోం ఐసొలేషన్‌ అవకాశం లేని వారిని రిమ్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణం వైరస్‌కు అనుకూలంగా ఉంటుందని ప్రజలు కొవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.  

మంచిర్యాలలో 1300కు పైగా ..

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి  నివారణకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రెండు నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లోనూ అజాగ్రత్త, అలసత్వం ఏ ర్పడింది. ఇదే కొనసాగితే సెకండ్‌ వేవ్‌ వస్తే ఇబ్బందికరం గా మారనుంది. దీంతో జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. 

నిత్యం 1600 పరీక్షలు చేసేందుకు ..

ప్రస్తుతం పీహెచ్‌సీ, సీహెచ్‌లు, జిల్లా కేంద్రంలోని దవాఖానల్లో టెస్ట్‌లు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కిట్‌ ఇస్తున్నారు. ప్రతి రోజూ 1600 టెస్ట్‌లు చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇందకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజూ 1300 వరకు టెస్ట్‌లు చేస్తున్నామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న 104 వాహనాలను సైతం పరీక్షల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అవసరమైతే మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలు..

గతంలో జిల్లా కేంద్రాలు, ఏరియా దవాఖానలు, తర్వాత మండల కేంద్రాలకు పరిమితమైన మొబైల్‌ ర్యాపిడ్‌ పరీక్షలను పల్లెల చెంతకు తీసుకురానున్నారు. ఇందుకోసం అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. ప్రతి సెంటర్‌లో మొబైల్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన కిట్లను సైతం సిద్ధం చేశారు. logo