శ్రీకాంతాచారికి నివాళి

ఎదులాపురం: తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపారని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గాడిచర్ల సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట అమరవీరుల స్తూపం వద్ద గురువారం శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నర్సింహులు, స్వర్ణకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, సభ్యులు అజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇచ్చోడ: మండల కేంద్రంలోని పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గోవర్ధన్, లక్ష్మణ్, గుండయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉట్నూర్: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ బాలాజీ, రాజేశ్, రవీందర్, బాపురావు, ఆనంద్, భూపతి, గంగాధర్ పాల్గొన్నారు.