ఆదివారం 24 జనవరి 2021
Adilabad - Dec 03, 2020 , 00:08:05

జాతీయ స్థాయిలో రాణించాలి

జాతీయ స్థాయిలో రాణించాలి

  • ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌  జనార్దన్‌ 

నార్నూర్‌: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. మండలంలోని గంగాపూర్‌ గ్రామంలో వినాయక యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నార్నూర్‌ పోలీసుల సహకారంతో బుధవారం నిర్వహించిన క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు. క్రమశిక్షణతో పోటీల్లో  తమ ప్రతిభ కనబర్చాలన్నారు. నార్నూర్‌ సీఐ రమణ మూర్తి మాట్లాడుతూ యువతకు స్వయం ఉపాధి కోసం పోలీస్‌ శాఖ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆసక్తిగల యువత ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో నార్నూర్‌ ఎస్‌ఐ మాదాసు విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ యుర్వేత రూప్‌దేవ్‌, ఇంద్రవెల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావ్‌, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, బలాన్‌పూర్‌ సర్పంచ్‌ ఆత్రం పరమేశ్వర్‌, ఉపసర్పంచ్‌ నాగోరావ్‌, మాజీ ఎంపీటీసీ రాథోడ్‌ రమేశ్‌, చిక్రం భీంరావ్‌పటేల్‌, సుభాష్‌, నాయకులు పాల్గొన్నారు.


logo