బుధవారం 20 జనవరి 2021
Adilabad - Dec 03, 2020 , 00:09:56

జనవరి 17న ‘పల్స్‌ పోలియో’

జనవరి 17న ‘పల్స్‌ పోలియో’

  • ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌
  • పీహెచ్‌సీ సూపర్‌వైజర్లు, వైద్యులకు ఒక రోజు వర్క్‌షాప్‌

ఎదులాపురం : జనవరి 17వ తేదీన పల్స్‌ పోలియో నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో పీహెచ్‌సీల సూపర్‌వైజర్లు, వైద్యులకు ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్స్‌ పోలియోకు సంబంధించి క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ సమయంలో కొవిడ్‌-19 నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, జిన్నింగ్‌ ఫ్యాక్టరీలు, సంచార జాతుల పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. పోలియో నిర్వహణ రోజున పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.., రెండో రోజు నిర్వహించే ఇంటింటి కార్యక్రమంపై ప్రాంతీయ రీజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అతుల్‌ నిగాని శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాధన, డీఐవో డాక్టర్‌ విజయసారథి, డీఎస్‌వో వైసీ శ్రీనివాస్‌, జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు, మాస్‌ మీడియా అధికారి వెంకట్‌రెడ్డి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.logo