శనివారం 16 జనవరి 2021
Adilabad - Dec 01, 2020 , 04:16:18

మట్కా నిర్వాహకుడు అరెస్టు

మట్కా నిర్వాహకుడు అరెస్టు

ఎదులాపురం: మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు టాస్క్‌ ఫోర్స్‌ సీఐ ఈ చంద్రమౌళి తెలిపారు. సోమవారం ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంతంలో టూటౌన్‌ ఎస్‌ఐ కె విష్ణు ప్రకాశ్‌తో కలిసి మాటువేసి చాకచక్యంగా మట్కా నిర్వాహకుడు తడవ దీపక్‌ సింగ్‌ భూక్తాపూర్‌ వాసిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.2690 నగదు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్‌ ప్రాంతంలో అమాయక ప్రజలను టార్గెట్‌ చేసి అధిక డబ్బులు వస్తాయని మభ్యపెట్టి మట్కా జూదంలో డబ్బులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. టూటౌన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజుద్దీన్‌, హనుమంతరావు, టూటౌన్‌ కానిస్టేబుళ్లు ఎస్‌ గోపాల్‌, కే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.