శనివారం 23 జనవరి 2021
Adilabad - Nov 29, 2020 , 00:39:51

మోదీ దిష్టిబొమ్మ దహనం..

మోదీ దిష్టిబొమ్మ దహనం..

రైతులపై లాఠీచార్జికి నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం ఎదుట శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు లింగాల చిన్నన్న మాట్లాడుతూ.. దేశానికి అన్నంపెట్టే రైతులను మోదీ సర్కార్‌, లాఠీలతో కొట్టడం హేయమన్నారు. ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించాలే గానీ, ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్‌, ఆశన్న, దేవిదాస్‌, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.   

- ఎదులాపురంlogo