సోమవారం 18 జనవరి 2021
Adilabad - Nov 26, 2020 , 00:24:46

ఆదాయాన్ని పెంచేందుకు ప్రణాళికలు

ఆదాయాన్ని పెంచేందుకు ప్రణాళికలు

  • ఇబ్బందులున్నా క్రమం తప్పకుండా వేతనాలు
  • సీఎం కేసీఆర్‌కు  రుణపడి ఉంటాం
  •  ఆర్టీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఈడీ పీవీ మునిశేఖర్‌

ఎదులాపురం: ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెం చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రో డ్డు రవాణా సంస్థ హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పీవీ మునిశేఖర్‌ అన్నారు.  స్థ్ధానిక బస్టాండ్‌ ఆవరణలోని డిపోను బుధవారం  పరిశీలించారు. బస్సులను తనిఖీ చేశారు.  సిబ్బం ది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్గో, పార్సిల్‌, కొరియర్‌ కార్యాలయాన్ని పరిశీలించి వినియోగదారులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆర్‌ఎం కా ర్యాలయ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో నష్టపోయిన ఆదాయాన్ని వివరించారు. అదే విధంగా  సంస్థ లాభాల బాటలో నడవాలంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోజువారీ ఆదా యం రూ. 13 కోట్లు రావాల్సి ఉండగా, రూ.  9 కోట్లు వస్తున్నదన్నారు. నేటికీ రోజుకు రూ. 4 కో ట్లు నష్టంలోనే ఉన్నట్లు తెలిపారు. ఇబ్బందులు న్నా ఉద్యోగుల వేతనాలు కచ్చితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై నిత్యం ఆధార పడకుండా ఆర్టీసీ రోజువారీ ఆదాయం పెంచుకునే దిశగా ప్ర యత్నిస్తామని పేర్కొన్నారు. క్రమంగా అన్ని రూ ట్లలో బస్సులు నడిపిస్తామని చెప్పారు. ఆర్టీసీ స్థ లాలు కబ్జాకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీ సుకుంటున్నామన్నారు. ఆదిలాబాద్‌ ఆర్‌ఎం విజయభాస్కర్‌, డీవీఎం ఎం. రమేశ్‌, పీవో విలాస్‌ రె డ్డి, ఏవో బాల స్వామి, డిపో మేనేజర్లు జనార్దన్‌, అంజనేయులు, మల్లేశ్‌, రవీందర్‌,  మారుతి  ఆ ర్టీసీ ఎస్‌ఐ నత్తులాల్‌, సిబ్బంది ఉన్నారు.