శనివారం 23 జనవరి 2021
Adilabad - Nov 25, 2020 , 04:26:44

వాహనదారులకు బాసట

వాహనదారులకు బాసట

  •   వాహనపన్ను రద్దుపై హర్షాతిరేకాలు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: మోటార్‌ వాహనాల ఆరు నెలల పన్ను ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో  టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం సంబురాలు నిర్వ హించారు. తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి అసోసియే షన్‌ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. కరోనా కారణంగా  చాలా రోజుల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ప్యాసింజర్‌ వాహనాలతో పాటు గూడ్స్‌, ఇతర ఏ వాహనాలు నడపలేదు. దీంతో వాహనాల యజమా నులు నష్టపోయారు. సీఎం కేసీఆర్‌ మోటార్‌ వాహనాల పన్నును రద్దు చేయడంతో జిల్లాలో 12,181 వాహనాలకు సంబంధించిన మార్చి నుం చి సెప్టెంబరు వరకు ఆరు నెలల టాక్స్‌ మాఫీ అయింది. పసుపు పచ్చ రంగు ఉన్న నంబరు ప్లేటు ఉన్న వాహనాలు టాక్స్‌ రద్దు పరిధిలోకి వ స్తాయి. ఆరు నెలల కాలానికి సంబంధించిన రూ. 18 కోట్ల పన్ను రద్ద యింది. కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను దేవుడిలా ఆదు కు న్నారని వాహనాల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కష్టకాలంలో ఆదుకున్నరు..

కరోనా కారణంగా మార్చి నుంచి చా లా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా యి. ఆరు నెలలపాటు వాహనాలు నిలిచి పోవడంతో పన్నులు,  రుణాలు కట్టలేని పరిస్థితి. పన్నులు కట్టకపోతే అధికారులు ఫైన్లు వేస్తున్నరు. ఇలాంటి కష్టకాలంలో సీఎం కేసీఆర్‌ మాకు ఎంతో అనుకూలమైన నిర్ణయం తీసుకున్నరు. మా ర్చి నుంచి సెప్టెంబరు వరకు ఆరు నెలలకు సంబంధించిన టాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో రెండు క్వార్టర్లకు కలిపి రూ. 18కోట్ల వరకు మాఫీ కానున్నాయి.  ప్రభుత్వం తీసుకన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నరు.

- ప్రమోద్‌కుమార్‌, అసోసియేషన్‌ సభ్యుడుlogo