ఆదివారం 17 జనవరి 2021
Adilabad - Nov 25, 2020 , 04:26:47

పంటకల్లాలతో రైతులకు ప్రయోజనం

 పంటకల్లాలతో  రైతులకు ప్రయోజనం

  • ఆదిలాబాద్‌ డీఆర్డీఏ ఏపీడీ రవీందర్‌

భీంపూర్‌: ప్రభుత్వం నిర్మిస్తున్న పంటకల్లాలతో రైతులకు మేలు చేకూరుతుందని ఆదిలాబాద్‌ డీఆర్‌డీఏ ఏపీడీ రవీందర్‌ రాథోడ్‌ అన్నారు. భీంపూర్‌ మండలంలోని నిపాని, వడ్‌గాం గ్రా మాలను ఆయన మంగళవారం సందర్శించి పంటకల్లాలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంప్‌ యార్డులను పరిశీలించారు. ఇప్పటికే అందర్‌బంద్‌, వడ్‌గాం, నిపాని గ్రామాల్లో కొందరు రైతులు పంటకల్లాలు నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈజీఎస్‌ ద్వా రా ఈ కల్లాలు నిర్మించుకునే అవకాశం ఉన్నా, కొందరు శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. రైతులకు సర్పంచ్‌లు అవగాహన కల్పించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల పనులను త్వర గా పూర్తిచేయాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వినోద్‌, ఈజీఎస్‌ ఏపీవో సంగీత, ఈసీ నరేందర్‌ , సర్పంచ్‌లు గొట్టిముక్కుల భూమన్న, చిన్ను, పెండెపు కృష్ణ ,అనిల్‌ ఉన్నారు.