బుధవారం 20 జనవరి 2021
Adilabad - Nov 24, 2020 , 04:08:23

గురుకులాలకు ప్రత్యేక గుర్తింపు

గురుకులాలకు ప్రత్యేక గుర్తింపు

ఎదులాపురం : తెలంగాణలోని గురుకులాలు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయని అడిషన్‌ ఎస్పీ ఎం రాజేశ్‌ చంద్ర అన్నారు. రాష్ట్ర గురుకులాల కార్యదర్శి, అడిషనల్‌ డీజీపీ ప్రవీణ్‌ కుమార్‌ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కేక్‌ కట్‌ చేయించారు. ఇటీవల  స్వేరోస్‌ ఆధ్వర్యంలో నిర్వహించి విస్డమ్‌ లీగ్‌ జోనల్‌ స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఏఎస్పీ సత్కరించారు. గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌ రావు, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ స్వామి, స్వేరోస్‌ సభ్యులు పెంటపర్తి ఉశన్న,  కూర పొచ్చన్న,  సత్యరాజ్‌,సందీప్‌, సాగర్‌ జూనియర్‌ స్వేరోస్‌లు పాల్గొన్నారు.


logo