మార్మోగిన దండారీ ప్రాంగణాలు

- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
- అబ్బురపరిచే హాస్యనాటికల ప్రదర్శనలు
- కొనసాగుతున్న ఉత్సవాలు
- జామడలో పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్,
- ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, పీవో భవేశ్ మిశ్రా
ఆదిలాబాద్ రూరల్/ఇంద్రవెల్లి/బోథ్/భీంపూర్/ సిరికొండ : డప్పుల మోతలు.., గజ్జెల చప్పుళ్లు.., గోండి పాటలు.., హాస్యనాటికలు.., గుస్సాడీల నృత్యాలతో ఆదివాసీ గూడేలు, గ్రామాల్లోని దండారీ ప్రాంగణాలు మార్మోగాయి. శుక్రవారం కూడా ఉత్సవాలు కొనసాగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు గిరిజనులను ఆకట్టుకున్నాయి. ఏత్మాసార్పేన్కు సామూహిక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి, దహీగూడ, మామిడిగూడల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. గుస్సాడీ టోపీ ధరించి, అందరినీ ఆకట్టుకున్నారు. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలెగూడ, డొంగర్గాం, సమక గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావ్ పాల్గొన్నారు. అలాగే బోథ్, భీంపూర్, సిరికొండ మండలాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఆదివాసుల సంప్రదాయాలు గొప్పవి..
నార్నూర్ : ఆదివాసుల సంస్కృతీసంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని జామడ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రాతో కలిసి హాజరయ్యారు. వారికి ఆదివాసులు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్దలతో కలిసి ఏత్మాసార్ పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమావేశంలో ప్రముఖులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను నియమనిష్టలతో నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ ఉత్సవాల్లో మొదటి సారిగా పాల్గొన్నానని, నృత్యాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదివాసులకు సూచించారు. ఆదివాసుల సంస్కృతీసంప్రదాయాల ప్రత్యేకత పదిలంగా ఉండేలా చూడాలని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రాకు సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు.
యువతను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసమే పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత పీవో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి కలెక్టర్ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, నార్నూర్ సీఐ రమణామూర్తి, తహసీల్దార్ మహ్మద్ జాకీర్, ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ మడావి ముక్తారూప్దేవ్, రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గుపటేల్, కుమ్ర గుణవంత్‌రావ్ పటేల్, లాల్శావ్పటేల్, గ్రామపెద్దలు ఉన్నారు.
తాజావార్తలు
- పశ్చిమ గోదావరిలో అంతుచిక్కని వ్యాధి కలకలం..
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్‌డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు