చలిగిలి

- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఇగం ముప్పేట దాడి
- రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- కమ్మేస్తున్న పొగమంచు.. వణికిపోతున్న ప్రజలు..
- పగలు వేడి.. రాత్రి తీవ్రమైన ఇగం..
- వృద్ధులు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు
- జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతున్నది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు జంకుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా బేల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. ఆదివారం 9.5, సోమవారం 8.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పగలు చలి తక్కువగా ఉన్నప్పటికీ రాత్రిళ్లు పరిస్థితి దారుణంగా ఉంటున్నది. ఇక, అటవీ ప్రాంతంలో మంచు కమ్మేస్తు న్నది. ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగిపోవడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటే స్వెటర్లు, జర్కిన్లు ధరిస్తున్నారు.
- ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ/ నిర్మల్ అర్బన్
ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ/నిర్మల్ అర్బన్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల్లోపు ఉన్నప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పోల్చితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగానికి పైగా తగ్గుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యా యి. రాష్ట్రవ్యాప్తంగా ఇవే అత్యల్ప ఉష్ణోగ్రతలు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన చలిగాలులు వీస్తున్నాయి. వీటికితోడు పొగమంచు దట్టంగా అలుముకుంటుండడంతో చలి తీవ్రమవుతున్నది. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. నవంబర్ మొదటి వారంలోనే చలితీవ్రత ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల కారణంగా చలి, ఎండ తీవ్రత ఈ ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శీతాకాలంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇక్కడ తక్కువగా నమోదవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
వృద్ధులు చిన్నారులపై తీవ్ర ప్రభావం
10.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అనారోగ్యాల బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధు లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. పెరుగుతున్న చలి తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెచ్చని దుస్తులు, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. జిల్లాలో ప్రతి యేటా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో ఈ ప్రాంతంలో ఉన్ని దుస్తులు,స్వెట్టర్లు, బ్లాంకెట్లు, మఫ్లర్లకు డిమాండ్ ఎక్కువ ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు వెచ్చని నేస్తాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.
క్రమంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు..
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 రోజుల క్రితంతో పోల్చితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో కొద్దిగా మార్పు మాత్రమే కనిపించింది. కానీ.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగానికి పడిపోవడంతో పాటు 10.3 డిగ్రీలకు చేరుకుంది. వారం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతను పరిశీలిస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో ఆదివారం 9.5, సోమవారం 8.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజావార్తలు
- పేదల సంక్షేమానికి పెద్దపీట
- బ్యాంకింగ్‌లోకి కార్పొరేట్లకు అనుమతి మంచిదే: ఆదిత్యపూరీ
- చిత్తారమ్మ జాతరకు సర్వం సిద్ధం
- ఆరు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం: మోదీ సంకేతాలు
- ‘గ్రాజియా’ ఫీచర్స్...అదుర్స్...!
- 27న జైలు నుంచి శశికళ విడుదల
- బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలతో టాటా టైఅప్.. అందుకేనా?!
- హాస్పిటల్లో ‘RRR’ హీరోయిన్ అలియా భట్..!
- సార్క్ దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ : విదేశాంగ శాఖ
- వరుణ్‌ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!