శుక్రవారం 04 డిసెంబర్ 2020
Adilabad - Oct 31, 2020 , 00:26:58

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

  • ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆలయాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలోని రామాలయంలో 44 ఫీట్ల ఎత్తయిన ఏకశిల ధ్వజ స్తంభాన్ని శుక్రవారం ప్రతిష్ఠించారు.  ఈ సందర్భంగా వేద పండితులు ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజలు చేశారు.  భక్తులకు మహా ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ డీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, జడ్పీటీసీ నల్లా వనిత, సర్పంచ్‌ దొగ్గలి ప్రమీళ, టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లా రాజేశ్వర్‌, సుధీర్‌, సుధాకర్‌, కేశవ్‌ పాల్గొన్నారు.