ఆదివారం 29 నవంబర్ 2020
Adilabad - Oct 30, 2020 , 00:38:58

ధరణి పోర్టల్‌తో ఆస్తుల రక్షణ

ధరణి పోర్టల్‌తో ఆస్తుల రక్షణ

  • ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ 
  • మావల, ఆదిలాబాద్‌ రూరల్‌ తహసీల్‌ కార్యాలయాల్లో  ప్రారంభం
  • జైనథ్‌, బేలలో ఎమ్మెల్యే రామన్న, తలమడుగులో బాపురావు

ఆదిలాబాద్‌ రూరల్‌: ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలోని ప్రజల ఆస్తుల కు రక్షణ ఏర్పడిందని ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్‌ నగర్‌లో ఉన్న మావల, ఆదిలాబా ద్‌ రూరల్‌ తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల భూములకు సంబం ధించిన సమగ్ర సమాచారం ఒకే చోట చేర్చి, వారి ఇబ్బందులను తొలగించేందుకే ఈ వెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్‌ రూపొందించారని పే ర్కొన్నారు. త్వరలోనే ఇండ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం ధరణి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ రూపకల్పనతో ప్రజలకు చాలా వరకు ఇబ్బందులు తప్పు తాయన్నారు. ఆర్డీవో జాడి వెంకటేశ్‌, తహసీల్దార్‌ వనజా రెడ్డి, రూ రల్‌ తహసీల్దార్‌ మోహన్‌సింగ్‌, కౌన్సిలర్‌ అజయ్‌, టీఆర్‌ఎస్‌ నాయ కులు నల్లా రాజేశ్వర్‌, రాగం గోవర్ధన్‌, శివకుమార్‌  పాల్గొన్నారు. 

దేశంలోనే తొలిసారిగా..: ఎమ్మెల్యే జోగు

జైనథ్‌/ బేల: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల సౌకర్యార్థం ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందించిందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జో గు రామన్న అన్నారు. జైనథ్‌ మండల కేంద్రంలో ధరణి పోర్టల్‌ను గురువారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయ, విక్రయాలు నిమి షాల్లోనే పట్టా మార్పిడి జరుగుతుందన్నారు. ఈ వెబ్‌సైట్‌తో రైతుల కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు.  జైనథ్‌లో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ లింగారెడ్డి, వైస్‌ ఎంపీపీ విజయ్‌ కుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌ రెడ్డి, తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, డీటీ రాజేశ్వరి, ఎంపీడీవో, సర్పం చ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. బేలలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ రావుత్‌ మనోహర్‌, తహసీల్దార్‌ బడాల రాంరెడ్డి, ఎంపీపీ వనితా ఠాక్రే, జడ్పీటీసీ పవార్‌ అక్షిత, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్ర శేఖర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్‌లు వాడ్కర్‌తేజ్‌రావు, కోడే బిపీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దేవన్న, తన్వీ ర్‌ఖాన్‌, కిషన్‌ వైద్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. 

తలమడుగు: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను గురువారం ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు  స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి కృ షి చేస్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల రైతు లకు నూతన పట్టాలతో పాటు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. ఎమ్మెల్యేను అధికారులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, డీటీ సంతోష్‌,  సర్పంచ్‌ కరు ణాకర్‌ రెడ్డి, ఎంపీటీసీ ఎలుగు చంటి, ఎంపీడీవో రమాకాంత్‌, టీఆ ర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ వెల్మ శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు కా టిపెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్‌, తోట వెంకటేశ్‌, అబ్దుల్లా, కిరణ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు, 

గుడిహత్నూర్‌: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయ ఆవ రణలో ధరణి పోర్టల్‌ ఆవిష్కరణ సందర్భంగా గురువారం  సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మనంద్‌ మాట్లాడు తూ రెవెన్యూ శాఖలో అవినీతికి తావివ్వకుండా పారదర్శకంగా భూ ముల క్రయవిక్రయాలు జరిగేలా ధరణి పోర్టల్‌ తీసుకువచ్చారన్నా రు.  ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, ఎంపీటీసీలు శగీర్‌ ఖాన్‌, న్యాను, నాయకులు జాదవ్‌ రమేశ్‌, బీ లక్ష్మీనారాయణ, వామన్‌ పటేల్‌, సం గ ఆశన్న యాదవ్‌, సత్యరాజ్‌, సతీశ్‌, మాధవ్‌,  దిలీప్‌, పాల్గొన్నారు.

ఖానాపూర్‌: ఖానాపూర్‌ తహసీల్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ను ఎమ్మెల్యే రేఖానాయక్‌ ప్రారంభించారు. ధరణి పనితీరును, రి జిస్ట్రేషన్లు జరిగే విధానాన్ని తహసీల్దార్‌ ఎర్ర నరేందర్‌ను అడిగి  తె లుసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య, ఖానాపూర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ ఇప్ప శ్రీనివాసరెడ్డి, సత్తెనపెల్లి చైర్మన్‌ ఆమంద శ్రీనివాస్‌, రైతుబందు మండల కన్వీనర్‌ పుప్పాల గజేంధర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శనిగారపు శ్రవన్‌,  మండల ఉపాధ్య క్షుడు వాల్‌ సింగ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కరిపె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ  ఖానాపూర్‌, పెంబి మండలాల అధ్యక్షులు తాళ్లపెళ్లి రాజ గంగన్న, పుప్పాల శంకర్‌, కౌన్సిలర్లు కావలి సంతోష్‌, తొంటి శ్రీని వాస్‌, సురేశ్‌, శంకర్‌, నారాయణ, రాజారెడ్డి ఉన్నారు.